ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

ఆ కాశ్మీర్‌ని తీసుకొస్తే మోడీ ధన్యుడే

పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న కాశ్మీర్‌ని తిరిగి భారతదేశంలోకి తీసుకురావాలనే మహా సంకల్పంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టిపెట్టారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై నరేంద్రమోడీ చర్చించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా ఆ భూభాగం, పాకిస్తాన్‌ ఆధీనంలో ఉంది. అక్కడ పాకిస్తాన్‌ సైన్యాలు యధేచ్ఛగా తిరుగుతాయి. అక్కడి ప్రజల్ని నాశనం చేస్తుంటాయి. అక్కడే తీవ్రవాదుల స్థావరాల్ని నెలకొల్పుతుంటాయి. కానీ అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌తో సంబందం లేని ప్రాంతంగానే చూపుతుంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌ […]

ట్విట్టర్ లో షాక్ ఇచ్చిన సుష్మా స్వరాజ్

ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ ముస్లిం జంటను కలపడంలో ఆమె సహకరించడం .. ఇవన్నీ చూసి ఓ కుర్రాడికి ఆమెను టీజ్ చెయ్యాలనిపించింది.. అంతే.. “నా కొత్త కారు పాడయిపోయింది, పొగ వస్తోంది, షాపు తీసికెళితే వాడు రీప్లేస్ చేయనంటున్నాడు.. నన్నేం చేయమంటారు, మీరో మాట చెబితే నాకు […]

సివిల్స్ టెస్ట్ లో మోడీ జపం

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమ్స్ ప‌రీక్షలో మోదీ ప్రభుత్వంపై అడిగిన ప్రశ్నలు అభ్యర్థుల‌కు నిజ‌మైన ప‌రీక్ష పెట్టాయి. మొత్తం వంద ప్రశ్నల్లో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాల గురించే 13 కావ‌డం గ‌మ‌నార్హం. ప్రధానమంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, స్టాండ‌ప్ ఇండియా, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజ‌న‌, స్ట‌డీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫ‌ర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్‌, ప్రధాన‌మంత్రి ముద్రా యోజ‌న‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ల‌పై ప్రశ్నలు అడిగారు. వీటిపై చాలామంది అభ్యర్థులు మండిప‌డుతున్నారు. ఆధునిక చ‌రిత్ర‌, […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ

లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! […]

ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]