ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]
Tag: bjp
టీడీపీ-బీజేపీ కలిసి ఉంటే లాభం.. విడిపోతే నష్టం
`కలిసి ఉంటే కలదు సుఖం` ఇప్పుడు ఈ సూత్రం బీజేపీకి కరెక్ట్‌గా నప్పుతుంది. ముఖ్యంగా ఏపీలో ఇది మరింత సూటవుతుంది. టీడీపీతో ఎప్పుడుప్పుడు విడిపోయి.. సొంతంగా ఎదగాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ విడిపోతే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ మూడేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోడీపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ […]
కన్నాకు జగన్ బంపర్ ఆఫర్
గత ఎన్నికల్లో విజయానికి చివరి మెట్టు వరకూ వచ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజయతీరాలను అందుకుని అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక రాజధాని ప్రాంతంలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు.. తన తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇతర పార్టీల్లో చేరిన నేతలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]
తెలంగాణలో బీజేపీతో అంటకాగితేనే టీడీపీకి లైఫ్!
దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు నాట అప్రతిహతంగా చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం దెబ్బతో ప్రస్తుతం విలవిలలాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేపట్టి చక్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో తన ముద్ర శాశ్వతమని పదే పదే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కనీసం కన్నెత్తి […]
తమిళ తెరపై కాషాయ సినిమా మొదలైందా..?
తమిళనాడు రాజకీయాలను తెర వెనుక నుంచి నడపాలని ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. ఎట్టకేలకు విజయం సాధించింది. నయానో భయానో చివరికి పరిస్థితులను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుని సక్సెస్ అయింది. తన మార్క్ వ్యూహంతో కేంద్రం పక్కాగా.. శశికళ వర్గాన్ని తమిళ రాజకీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా వేయడం మొదలుకుని.. సీఎం పళనిస్వామి నేరుగా మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసేలా చేసి తమిళ రాజకీయాలను శాసించే స్థాయికి […]
అద్వానీకి దెబ్బా..? కుట్రా…?
రాష్ట్రపతి పదవి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద కట్టడం బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీ, ఉమాభారతితో సహా మొత్తం 16 మందిని కుట్రదారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి లక్నో ట్రయిల్ కోర్టును కేసు […]
2019: టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తు
సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు […]
కర్ణాటకలో బీహార్ ఫార్ములా: కాంగ్రెస్+జేడీఎస్ పొత్తు
బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేసేందుకు కర్ణాటకలో బీహార్ ఫార్ములా అమలు కాబోతుందా ? ఎట్టి పరిస్థితుల్లోను కర్ణాటకలో కాషాయ జెండా ఎగరకుండా ఉండేందుకు… సెక్యులర్ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ, జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోనున్నాయా ? ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లోనే ఉండేవారు. దేవగౌడతో తీవ్రస్థాయిలో విబేధాలు రావడంతో ఆయన కాంగ్రెస్‌లో […]
ఆ ప్రచారమే ఎంఐఎం కొంపముంచుతోందా..?
రాజకీయాల్లో అసద్దుద్దీన్ సోదరులు అంటే అందరికీ హడలే! అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు సమావేశాల్లో వారు మాట్లాడే విధానం వింటే.. వారికి సమాధానం చెప్పడానికి కొంత ఆలోచించాల్సిందే! తమ వాగ్దాటితో అందరినీ హడలగొడుతుంటారు ఈ సోదరులు! ముఖ్యంగా ముస్లింలు ఎక్కడుంటే అక్కడ.. పోటీ చేసి ఎంఐఎం సత్తా చాటాలని కోరుకుంటారు. కానీ ఇదే వాళ్ల కొంపముంచుతోందట. ముఖ్యంగా బీజేపీ అంటే ఆమడ దూరంలో ఉండే వీరు.. బీజేపీతో కలిసిపోయారనే ప్రచారం జోరందుకుంది. దీంతో పార్టీ నాయకుల్లో ఇది […]