రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. రాజధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వనరులను కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచి విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తెప్పించుకోవడం, లోటు బడ్జెట్ నిధులు విడుదలయ్యేలా చూడడం, అప్పలు, ఆస్తుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడడం వంటివి ఏపీలో అధికార, విపక్ష పార్టీలపై ఉన్నాయి. దీనికి తోడు ప్రశ్నిద్దాం […]
Tag: bjp
తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!
తలైవా రజనీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ తెర వెనక శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న పరిణామాలను బట్టి చూస్తే.. రజనీ రమ్మంటే వచ్చేసేందుకు కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళనాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రజనీ ఏ రేంజ్‌లో వస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక, రజనీ ఏర్పాటు చేయబోతున్న పార్టీ కోసం బెంగళూరుకు చెందిన ఒక సంస్థ చాలా […]
టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం
బుల్లి తెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజకీయల్లోకి వచ్చిన వారిని మనం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణలో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటికల్ ఆఫర్ సంపాయించేసిన యాంకర్లను చూస్తే.. వారి లక్కే లక్కని ముక్కున వేలేసుకోకుండా ఎవరూ ఉండలేరు. మరి విషయం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపులర్ ఫిగర్స్. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి […]
జగన్ కల ఫలిస్తుందో.. కోరిక నెరవేరుతుందో చూడాలి
2019లో ఎట్టి పరిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని పంతం మీదున్న జగన్.. తన పట్టుదలను నెరవేర్చుకునేందుకు, తన కలల పీఠం ఎక్కేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. మొన్నామధ్య ప్రధానితో కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున రచ్చచేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వెనకాల జరిగిందేంటో బయటకు వస్తోంది. గత వారంలో తెలుగు రాష్ట్రాల […]
ఏపీలో బీజేపీకి ఆ ఒక్కడు కూడా దొరకట్లేదా..!
ఏపీలో ఎంత స్పీడ్‌గా విస్తరించాలని భావిస్తున్నా.. బీజేపీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. ముఖ్యంగా పార్టీకి అందరూ ఉన్నట్టే ఉన్నా.. ప్రజాకర్షణ ఉన్న నేత ఒక్కరూ లేకపోవడం పెద్ద మైనస్‌గా ఉంది. ఇటీవల అంటే 2014 ఎన్నికల సమయంలో అనేక మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చి చేరారు . వీరిలో కేంద్రంలో మంత్రి పదువులు నిర్వహించిన వారూ ఉన్నారు. అయినప్పటికీ కూడా 2019లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగలిగిన నేత ఏపీలో ఒక్కరూ కనిపించడం లేదు. దీంతో […]
తెలంగాణలో కమల నాథుల కలలు నెరవేరేనా?!
ఉత్తరాదిలో తమ పట్టును నిలుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు 2019లో జరగబోయే ఏపీ, తెలంగాణల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టిన బీజేపీ సారధి అమిత్ షా, ప్రధాని మోడీలు.. అటు తెలంగాణ, ఇటు ఏపీలలో నూ తాము సొంతంగా ఎదగాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి మూడు రోజులు పర్యటించిన అమిత్ షా తన పర్యటనను విజయవంతం చేసుకునేందుకు […]
అవమానాలు ఎదుర్కోలేక పార్టీ వీడనున్న కవిత!
ఈ హెడ్డింగ్ చూసిన వారు బీజేపీలోకి కవిత ఏంటి ? అని కాస్త కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కవిత అంటే కేసీఆర్ కుమార్తె కవిత కాదు…నిన్నటి తరం ప్రముఖ హీరోయిన్, ప్రస్తుత టీడీపీ నాయకురాలు అయిన కవిత. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లపాటు ఆమె పార్టీ తరపున వాయిస్ గట్టిగా వినిపించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న అతికొద్దిమందిలో కవిత ఒకరు. టీడీపీ ఆందోళనలను ఆమె ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ […]
టీడీపీ ఎంపీకి బీజేపీ ఆఫర్..!
పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా తాము కోరుకున్న పనులు నెరవేరకపోతే.. నేతలు ఎంతకైనా తెగిస్తారనేది పాలిటిక్స్‌లో మామూలే! ఏళ్ల తరబడి కాపు కాచిన పార్టీలను సైతం ఒక్క క్షణంలో వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పడు ఇదే జాబితాలోకి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చేరనున్నారట! కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని నరసరావు పేట నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల […]
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రెంటికీ చెడ్డ రేవడేనా?
ఏపీ, తెలంగాణల్లో బలమైన శక్తిగా అవతరించి.. 2019లో కుదిరితే కప్పు కాఫీ.. అన్నట్టు.. వీలైతే అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్న బీజేపీకి ఆదిలోనే హంసపాదులా ప్రజల్లో నమ్మకం చాలడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ చేస్తున్న, చేసుకుంటున్న ప్రచారమేననే వాదనా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం… పనిగట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని భారీ ఎత్తున ఉరుకులు పరుగులు పెట్టిద్దామని నాలుగు రోజుల పర్యటన కోసం తెలంగాణ, ఏపీలకు వచ్చిన కమల […]