తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా […]
Tag: bjp
దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!
ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ భావించినప్పటికీ.. చివరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించగా.. బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేతలు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని కలవరపడుతున్నారట. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్‌లో చేరాలని భావిస్తున్నారట. బీజేపీ […]
టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఈటల..!
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియా సమావేశమైన ఈటల.. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఇక టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. […]
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..ముహూర్తం ఫిక్స్!?
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 4 (రేపు) టీఆర్ఎస్ పార్టీతోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ […]
బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఖరారు!
గత రెండు రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. దీంతో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటల చేరుతారనే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈటల పార్టీలో చేరే విషయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ నేతలతో మాట్లాడారు. […]
కోవిడ్ ను ఎదుర్కోనేందకు కేంద్రం కొత్త కార్యక్రమం
దేశంలో కోవిడ్-19 సంక్రమణ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64, సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వాటిని అందివ్వనున్నారు. ఆ రెండు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది కూడా. ఆయూష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి సమగ్ర […]
స్మశానానికి స్వాగతం.. బీజేపీ శవరాజకీయాలు..!
రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తుంటారు. తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. పోస్టర్లను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు ఆఖరికి కొవిడ్ మరణాలను కూడా తమ ప్రచారానికి వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మశానానికి స్వాగతం అంటూ కట్టిన ఫ్లెక్సీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం కర్నాటక రాష్ట్రం నెలమంగల తాలూకా […]
బెంగాల్‌లో జేపీ నడ్డా శపథం.. ఏమిటంటే..?
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికిన కాషాయదళం ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేతిలో ఘోర పరాభవాన్ని పొందింది. ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు బీజేపీ అనుసరించిన దాడులను ఎన్నికల అనంతరం టీఎంసీ నేతలు కొనసాగిస్తున్నారు. వరుసగా బీజేపీ క్యాడర్‌పై దాడులకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ హడావుడిగా బెంగాల్‌లో పర్యటించారు. మమతాబెనర్జీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఆయన […]
ముందంజలో దీదీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో […]