వైసీపీ టీం..నిధుల కోసం ఢిల్లీలో వేట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి.. పలు పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితీ అంతంత మాత్రమే.. కేంద్రప్రభుత్వం కూడా నిధలడిగితే మొహం తిప్పుకుంటోంది.. రాష్ట్ర పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడులా కేంద్రం వద్దకు పదే పదే నిధుల కోసం వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు. […]

ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ).. ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్.. మోదీ ప్రభుత్వం వీఎస్పీ ప్రైవేటు పరం చేయనున్న నేపథ్యంలో దానిని కాపాడుకోవడానికి.. ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందడానికి పలు పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీఎస్పీ ఉద్యమ కారులకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం.. అధికార పార్టీ కూడా సహకరించాలని..  మా పార్టీ వాళ్లు రాజీనామా చేస్తారు.. వైసీపీ వాళ్లు కూడా చేయాలని పేర్కొన్నారు. అంటే వీఎస్పీ పరిరక్షణకు […]

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై.!?

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై.!? ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజ్‌ బొమ్మై. ఆయనది లింగాయత్‌ సామాజిక వర్గం. మాజీ సీఎం ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడే బసవరాజ్‌ బొమ్మై. బసవరాజ్‌ బొమ్మైను సీఎం చేయాలని సూచించిన యడియూరప్ప. ఈ సాయంత్రమే బసవరాజ్‌ బొమ్మై పేరు ప్రకటించే అవకాశం.

ఏపీ బీజేపీ కొత్త రాగం.. ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో..?

ఏపీలో ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా తెలుగుదేశం పార్టీగా గుర్తింపు ఉంది.  వారే.. కాదు మేము కూడా ఉన్నాం రాష్ట్రంలో.. ప్రభుత్వం చేసే తప్పులను మేము కూడా ఎత్తిచూపుతాం అంటున్నారు బీజేపీ నాయకులు. జనం తమను గుర్తించాలని వారు చేయని ప్రయత్నం లేదు.  అందుకే ఇపుడు ఆలయ పరిరక్షణ అనే కార్యక్రమం రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల చుట్టూ తిరిగి వాటిని పరిరక్షిస్తాడట. కమలం నేతలు, కార్యకర్తలు వెంటరాగా ఆలయాల వద్దకు […]

ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !

హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ  సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]

రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]

నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]

ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]

నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్న ఈట‌ల‌..ఏర్పాట్లు పూర్తి!

అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఈట‌ల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉద‌యం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]