ఆయన రాక వెనుక అంతరార్థం ఏమిటో..?

ఎప్పుడూ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు.. ఉండమన్నా ఉండడు.. నాయకులు, కార్యకర్తలు బలవంత పెడితే కాసేపు మాట్లాడతాడు.. ముఖ్య నాయకులతో సమావేశం కావాలంటే ఇక్కడకు వచ్చినపుడు కుదరదు.. ఢిల్లీకి వెళ్లి కలవాల్సిందే.. అంత బిజీ ఆయన.. ఆయన ఎవరో కాదు భారతీయ జనతా పార్టీని పగ్గాలు పట్టుకొని నడిపిస్తున్న జేపీ నడ్డా.. ప్రధాని మోదీకి అత్యంత ఇష్టుడు.. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి..అందులోనూ అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తున్న నడ్డా హైదరాబాదుకు వస్తున్నాడు. అందులో ఏముంది […]

జగ్గారెడ్డికి పొగ పెడుతున్నారా?

టి.కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండి.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది. మీరే ఇలా ప్రవర్తిస్తే .. ఇక సామాన్య కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ వెళుతుందని పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల సీఎం దత్తత గ్రామమైన ఎరవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు భారీ […]

జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?

హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!

భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]

ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?

గత ఎన్నికల్లో జగన్‌ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్‌ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]

గరం..గరం..గద్వాల రాజకీయం

డీకే అరుణ.. అప్పట్లో కాం‍గ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ […]

రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]