పిల్లలకు పాఠాలు చెప్పుకునే మేస్టారు, రాజకీయంగా తాను కొట్టే దెబ్బను తట్టుకోలేరులే అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, ప్రొఫెసర్ కోదండరామ్ విషయంలో అనుకుని, భంగపడినట్లున్నారు. కెసియార్ కారణంగానే కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా కనిపించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి. అక్కడికి కోదండరామ్ చాలా సంయమనం పాటించారు. రెండేళ్ళు వేచి చూసి, తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తీరతాయనీ, […]
Category: Top Stories
సాక్షి గూటికి కొమ్మినేని!
కొమ్మినేని శ్రీనివాస రావు పరిచయం అక్కర్లేని జర్నలిస్ట్.ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5,ఎన్టివి వంటి సంస్థల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. NTV లో రోజు ఉదయం ప్రసారమయ్యే KSR లైవ్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.వివిధ పత్రికల్లో, ఛానళ్లలో పనిచేసిన ఆయన ఇటీవలే ఎన్టివి నుంచి బయటకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో బయటికి రావాల్సి వచ్చిందో,అధికార పార్టీ నుండి ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో,ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మీడియా నడవకపోతే పరిణామాలెలా ఉంటాయో తన బ్లాగ్ లో వివరిస్తూ వాపోయాడు.కాగా […]
జగన్ కంచుకోటలో చంద్రబాబు పాగా !
కడప జిల్లా అంటే వైఎస్ జగన్ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్ జగన్‌కి షాక్ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]
రెండేళ్ళు ఫిక్స్ అయిన చరణ్
‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’లో నటిస్తున్నాడు. […]
రెచ్చిపోతున్న అధికార నేతలు
రాష్ట్రంలో ‘అధికార’ రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, దాదాగిరీతో విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్, దౌర్జన్యాలు, బెదిరింపులు హెచ్చరికలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపైనా దాడులకు దిగుతున్నారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ఐని, అడ్డుకున్న కానిస్టేబుళ్లను చితకబాదారు. విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్‌లీడర్ హోంగార్డును తీవ్రంగా కొట్టాడు. నూజివీడు ప్రాంతంలో సెటిల్‌మెంట్ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వృద్ధుడి మరణానికి కారణమయ్యారు. ఇక భూకబ్జాలు, ఇళ్లపైకి వెళ్లి అడ్డుకున్న వారికి కొట్టడాలు […]
అభిమాని నష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్
‘అఖిల్’ సినిమాతో తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు హీరో నితిన్. అఖిల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సాహసం చేశాడు నితిన్. కానీ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నంలో ఘోర పరాజయం చవి చూశాడు నితిన్. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది నితిన్‌కి. అయితే ఆ నష్టాల నుంచి మానసికంగా కోలుకునేలా ‘అ,ఆ..’ సినిమా పెద్ద హిట్‌నిచ్చి ఊరటనిచ్చింది. ఈ ఊపులో నితిన్, పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారమ్. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్ […]
నయనతార అంతగా పెంచేసిందా?
నయనతార మరీ టూమచ్ అని అనుకుంటున్నారు టాలీవుడ్‌లో. ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న నయనతార వద్దకు ఈ మధ్యనే ఓ నిర్మాత వెళ్ళారట. తన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాలని కోరగా, రెండు కోట్లకు పైనే నయనతార డిమాండ్ చేసిందని సమాచారమ్. నయనతారకి ఇదివరకటిలా ఇప్పుడు సక్సెస్‌లు లేవు, నిర్మాతలూ ఆమె కోసం ఎగబడటం లేదు. సీనియర్ హీరోయిన్ అయిపోయిన నయనతారకి, యంగ్ హీరోలతో నటించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ నయనతార రెమ్యునరేషన్ రెండు కోట్లకు […]
చందమామకి మాధురీ దీక్షిత్ కొరియోగ్రఫీ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్ మాజీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్ చేసే అవకాశం కాజల్ అగర్వాల్ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా. మోడ్రన్ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్ సొంతం. […]
కోదండరామ్ పై గులాబీ దండయాత్ర
తెలంగాణ సర్కార్ తీరే వేరు. తమ వైఖరిని ప్రతిపక్షాలు ఎండగట్టినా పట్టించుకోదు. పైగా విపక్షనేతలపై తనదైన తరహాలో విరుచుకుపడుతుంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తుతుంది. ఇలాంటి అధికార పార్టీ కోదండరామ్ తమను విమర్శించగానే అగ్గి మీద గుగ్గిలమైంది. అధిష్టాన పెద్దలతో పాటూ చిన్నాచితకా నేతలూ ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడి ఎన్నికలు రాగానే ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించుకుంది. టీఆర్ఎస్ లక్ష్యం స్వరాష్ట్రాన్ని సాధించడమే […]