ఆమ్ ఆద్మీపార్టీలో చేరే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నందుకే తాను రాజీనామా చేశానని అన్నాడు. “ ఎవరైనా మాతృభూమిని వదులుకుంటారా.. నేనెందుకు నా మూలాలు విడిచిపోవాలి.. నాలుగుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచాను. మోడీ ప్రభంజనం ఉన్నపుడు నన్ను కురుక్షేత్ర నుంచి గానీ పశ్చిమ ఢిల్లీ నుంచి గానీ పోటీ చేయమన్నారు. నేను నిరాకరించాను. నా రాష్ట్రం వదిలి నేను ఎక్కడికీ వెళ్ళదల్చుకోలేదు“ అని సిద్ధూ […]
Category: Politics
కార్నర్ అయ్యింది హరీష్‌రావే
మల్లన్నసాగర్ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ […]
మోడీ చెయ్యిదాటిపోయిందా?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం నరేంద్రమోడీ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది. రాజ్యసభలో తమ సభ్యుడి ద్వారా ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టించిన కాంగ్రెసు పార్టీ, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలనే కసితో ఉంది. కాంగ్రెసు వ్యూహాల్ని పసిగట్టడంలో బిజెపి విఫలమయ్యిందని నరేంద్రమోడీ, పార్టీ వేదికపై ముఖ్య నేతలకు క్లాస్ తీసుకున్నారట. రైల్వే జోన్ అంశంపై స్పష్టతను ఇవ్వడం, ప్రత్యేక ప్యాకేజీపై కొంతమేర ప్రకటన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని నరేంద్రమోడీ భావిస్తున్నారని […]
చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్
ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]
కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు
మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]
చంద్రబాబు ఈసారి రిస్క్ చేయదలచుకోలేదు
పోలీస్ శాఖలో ఉన్నతాధికారులుగా పనిచేసినవారు రాజకీయాల్లోకి రావడం వింతేమీ కాదు. సమైక్య తెలుగు రాష్ట్రానికి డిజిపిలుగా పనిచేసిన పేర్వారం రాములు, దినేష్ రెడ్డి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. పేర్వారం రాములు టిడిపిలో పనిచేసి, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో ఉన్నారు. దినేష్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాక భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళారు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్న సత్సంబంధాల కారణంగా […]
తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు
తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను […]
కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి
ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని […]
చంద్రబాబు ప్రచార పాట్లు అన్ని ఇన్ని కావు
కేంద్ర సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ శాఖల సమాచారం, సమన్వయం కోసం లక్షలు పోసి నియమించుకున్న ఎంఎల్‌ఓ (మినిస్టర్స్ లైజనింగ్ ఆఫీసర్లు), పీఆర్‌ఓ వ్యవస్థ విఫలం కావడంతో పథకాల ప్రచారం జనంలోకి వెళ్లడం లేదన్న ఫిర్యాదులు సీఎంకు అందాయి.చంద్రబాబుకు, ప్రచారానికి అవినాభావ సంబంధం ఉంది. బాబును చూసి జాతీయ నేతలు ఫాలో అవుతున్నారు. అయితే, […]