మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్‌ఎస్ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్‌పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, […]
Category: Politics
కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ
తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]
ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]
యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లీగల్ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్ లేకపోయినా, లాజిక్ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]
పవన్‌తో పోటీ ఎందుకు రోజా!
పవన్ ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. వస్తానంటున్నాడంతే. అలాంటి పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శిస్తే రోజాకి ఒనగూరే లాభమేంటట? రాజకీయాల్లో చిరంజీవి అంటే రోజాకి అస్సలు పడదు. టిడిపిలో ఉండగానే కాదు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా రోజా, ఇంకా గట్టిగా చిరంజీవిని విమర్శిస్తూ వచ్చారు. చిరంజీవితోపాటు పవన్‌కళ్యాణ్‌ని కూడా విమర్శించడం ఆమెకు అలవాటు. టిడిపి గెలిచిందే పవన్‌కళ్యాణ్ దయతో అని చెబుతూనే పవన్‌కళ్యాణ్‌ని రబ్బర్‌సింగ్ అని తీసిపారెయ్యడం రోజాకే చెల్లింది. రబ్బర్‌సింగో, గబ్బర్‌సింగో రోజాకే బాగా […]
టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]
సెక్స్ స్కాండల్: ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల కారణంగా కొందరు ముఖ్య నేతల్ని అరవింద్ కేజ్రీవాల్ పోగొట్టుకున్నారు. అయితే వారిని తొలగించడం వల్ల తన నిజాయితీ బయటపడుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలోనే సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్‌కుమార్‌ని తొలగించారు అరవింద్ కేజ్రీవాల్. అయితే ఇదివరకటిలా ఆయన తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని […]
హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]
చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు. ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ […]