దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందించిన హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరులో అమరావాతి రాజధానితోపాటు వెలగపూడిలో ఏపీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. మన ప్రాంతం మన పాలన పేరును పదే పదే జపిస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ […]
Category: Politics
తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద సవాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేలనో? ఆ పార్టీ అధినేత జగన్‌నో ఉద్దేశించి కాదు! తనకు తానుగానే రువ్వుకున్న సవాల్! విషయంలోకి వెళ్లిపోతే.. వైకాపా తరఫున 2014లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేసమయంలో ఆయన కుమార్తె అఖిల ప్రియ తన తల్లి శోభప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే […]
ఏపీ విద్యాశాఖలో సున్నాలకు అవినీతి కన్నం!
విద్యార్థులకు నీతులు నేర్పి.. ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే ఏపీ విద్యాశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింది! అందిన ప్రతి అవకాశాన్ని అవినీతికి ఆలవాలంగా మార్చుకునేందుకు నేతల మొదలు అధికారులు సిద్ధమవుతున్నారు. సర్వశిక్షా అభియాన్ మొదలుకుని ప్రతి దాంట్లోనూ అవినీతి దందానే. ట్యాబ్ లు కొనుగోలు మొదలుకుని ‘సున్నాలు’ వేసే వరకూ ప్రతి స్కీమ్ లోనూ అవినీతి ‘గంటలు’ మోగుతున్నాయి. మొన్నామధ్య టీచర్ల బదిలీ వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే వార్తలు వచ్చినా ఏ ఒక్కరూ […]
జగన్ శత్రువు గెడ్డం దీక్షకు మోక్షం
వైకాపా అధినేత జగన్‌కు పొలిటికల్ రైవల్ కడప టీడీపీ యువ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. ఎట్టకేలకు తన గడ్డం దీక్షకు మోక్షం లభించడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. తన దీక్ష ఫలించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, మొత్తంగా టీడీపీ విజయంగా ఆయన పేర్కొంటున్నారు. అదేసమయంలో వైఎస్ కు కంచుకోట వంటి పలివెందులలోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాలని, ఆదిశగా తాను మరిన్ని చర్యలు తీసుకుంటానని సతీష్ చెబుతున్నారు. ఈ […]
నయీం పేరుతో ఎమ్మెల్యే దందా
ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు తన మాట వినని వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతమొందించినా.. అతని తాలూకా అనుచరుల ఆగడాలకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. నయీంతో అంటకాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్పటికీ దందాలు సాగిస్తూనే ఉన్నట్టు పక్కాగా సీఎం కేసీఆర్‌కే సమాచారం అందిందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. నయీం అనుచరులుగా చక్రం తిప్పిన శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే […]
వంశీ నియోజకవర్గంలో నెహ్రూ జోక్యం…బాబుకు కంప్లైంట్
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కృష్ణాజిల్లా టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు ప్రధాన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల తిరగి టీడీపీ సైకిలెక్కిన దేవినేని నెహ్రూ, ఇప్పటికే టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీల మధ్య ఇప్పుడు వివాదాల వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు వీరి మధ్య ఘర్షణలకు తావిచ్చేలానే ఉండడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ కి చెందిన సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ నేత, […]
ఎలా ఎస్కేప్ అవ్వాలో వెంకయ్యకే బాగా తెలుసు
గంపెడు రాజకీయ చతురత, గుప్పెడు వ్యూహం కలగలిసిన పొలిటికల్ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన అచ్చంగా వెంకయ్యనాయుడే! ఏపీకి చెందిన కమలం పార్టీ ప్రధాన నేత అయిన ఈయన.. విద్యార్థి దశ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. అందుకే అపార రాజకీయ అనుభవంతో పాటు ఏ ఎండకాగొడుగు పట్టడం ఈయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు! తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వలేదో? దీనికి వెనుక ఏయే కారణాలు ఉన్నాయో తెలియజెప్పాలని నిర్ణయించుకున్న కమల దళం.. ఆ దిశగా […]
2019 కోసం వాళ్లను టార్గెట్ చేస్తోన్న జగన్
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు.. ఇక తమ పార్టీ అధికారంలోకి రావడమే తరువాయి అన్నంతగా మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించిన వైసీపీ అధినేత జగన్ ఫలితాలు వెలువడ్డాక ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేదనే చెప్పాలి. అయితే అధికార పీఠం చేరుకోవాలంటే.. ప్రజల్లో తనపై మరింత విశ్వాసం పెంచుకోవాలన్న వాస్తవ పరిస్థితి గ్రహించాక అధికార పక్షంపై ఆయన ఒకరకంగా యుద్ధమే చేస్తున్నారు. తండ్రిలాగే మడమ తిప్పని నైజమున్న జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంగా గట్టిగానే పోరాడుతున్నా.. రాజకీయ అనుభవం లేకపోవడం, వ్యూహ రచనా […]
ఆ ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారా..!
ఎవరు అవునన్నా కాదన్నాఇపుడు తెలంగాణకు కేసీఆర్ మహారాజు.. రాష్ట్రంలో ఆయనకు గట్టిగా ఎదురుచెప్పే సాహసం మాట దేవుడెరుగు… ఆయన పాలనలోని లోపాలను వెదికేందుకూ ఎవరికీ ధైర్యం చాలడంలేదు. ఆఖరికి మీడియా సైతం ఆయన అడుగులకు మడుగులొత్తాల్సిందే.. అవసరమైతే తెలంగాణ ప్రజల సెంటిమెంటు అస్త్రాన్ని ఇప్పటికీ ఎప్పుడు ఎలా వాడుకోవాలో… ఏ మోతాదులో ఉపయోగించాలో.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవడమే కేసీఆర్ అసలు బలమని ఇక్కడ గుర్తించాలి. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన […]