చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఈ సారి మంత్రి పదవులు ఖాయమని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కాదు, వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలనే మంత్రి వర్గం లోకి తీసుకుంటారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది! వైకాపా నుంచి జంప్ చేసి సైకిల్ ఎక్కిన వారిని కేబినెట్‌లోకి తీసుకుంటే ఎదురయ్యే రాజ్యాంగ సమస్యల గురించి గవర్నర్ […]
Category: Politics
హైదరాబాద్ రోడ్లలో భారీ స్కామ్..!
విశ్వాసం కలిగించలేక పోతున్నాయి. అవును మరి హైదరాబాద్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి. భాగ్యనగరంలో గట్టిగా వర్షం కురిస్తే.. జనజీవనం ఏ స్థాయిలో అస్తవ్యస్తం అవుతుందో ఇటీవల అందరికీ స్పష్టంగానే తెలిసొచ్చింది. నగరంలో ప్రజలకు రోడ్లు ప్రత్యక్ష నరకాన్నే చూపిస్తున్నాయని చెప్పాలి. కనీసం గుంతలు పూడ్చించలేని ప్రభుత్వ నిర్వాకం.. నగర వాసుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. మరోవైపు, పూడ్చని గుంతలకు, వేయని రోడ్లకు కూడా కొందరు కాంట్రాక్టర్లు […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం చూస్తే షాకే
తెలంగాణ ప్రజల నాడిని, అనుక్షణం పసికడుతూ… పాలనలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ.. అవసరమైనపుడు మళ్లీ ఉద్యమ భాషను ఉపయోగించి ప్రత్యర్థుల నోళ్లు, చేతులు కట్టేస్తూ టీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా అప్రతిహతంగా, ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చాక రోజులు గడుస్తున్నకొద్దీ.. అధికార పార్టీపై ప్రజల్లో ఏదో ఒక స్థాయిలో వ్యతిరేకత రావడం.. అది పెరుగుతూ పోవడం సర్వ సాధారణవిషయం. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఈ సంప్రదాయ లెక్కలేవీ… లెక్కలోకి రావని […]
ఏపీలో జంపింగ్‌లకు షాక్ తప్పదా
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున షాక్ తగలనుంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన ఆకర్ష్ దెబ్బకి ఒక్కరొక్కరుగా జగన్‌కు ఝలక్ ఇచ్చి మరీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్దతలకాయలు గా భావించిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కేబినెట్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి పదవి సహా పలువురికి అమాత్య పీఠాలు అప్పగిస్తానని బాబు హామీ ఇచ్చారని […]
మంత్రులను ఉతికి ఆరేసిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. తన మంత్రి వర్గ సహచరులపై నిప్పులు కక్కారు. ప్రతిపక్షంపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఒక పక్క విపక్షా లు అన్నీ కలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే మీకు కనిపించడంలేదా? అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే మీకు వినిపించడం లేదా? అంటూ ఉతికి ఆరేశారు. కేసీఆర్ ఉగ్రానికి మంత్రులందరూ షాక్ అయిపోయారట. శుక్రవారం జరిగిన ఈ పరిణామం తెలంగాణ అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. […]
టీడీపీలో మంత్రి వర్సెస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
గుంటూరులో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే తమ ఆధిపత్యం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమకు తామే సొంతంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించేస్తున్నారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. దీంతో అధికారుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్‌లు ఒక పార్టీ గొడుగు కిందే ఉన్నప్పటికీ.. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ సమన్వయ లోపంతో పాటు ఆధిపత్యం విషయంలోనూ […]
రాహుల్ డెసిషన్ టీ కాంగ్రెస్‌ను ముంచుతుందా
గత ఎన్నికలముందు .. తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకున్నకాంగ్రెస్ పార్టీని ఎన్నికల ఫలితాలు ఏస్థాయిలో ఖంగుతినిపించాయో ఎవరూ మరచిపోలేరు. ఆ పార్టీ అధిష్ఠానమైతే ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేదనే చెప్పాలి. పదేళ్లపాటు తెలంగాణ అంశాన్ని సాగదీసి, చివరకు వ్యూహాత్మకంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రాజకీయ ప్రయోజనాలను ఒడిసిపడదామని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఫలితాలు చూశాక గట్టి గుణపాఠమే నేర్చుకుందని చెప్పాలి. ఆ గుణపాటమేమంటే.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. ఆ పార్టీ స్థానిక […]
యనమలకు మైనస్ మార్కులు వెనక ఉన్నదెవరు
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పడు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట! తన పొలిటికల్ అనుభవం, చతురత, పాలనా అనుభవం అన్నీ ఆయనను వెక్కిరిస్తున్నాయట! అయ్యే అంత పెద్ద నేతకి ఇంత కష్టమా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చదివి తీరాలి. చంద్రబాబు తన మంత్రివర్గంపై ఇటీవల సర్వే చేయించారు. వారి పనితీరు, ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు? పదవిని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు? […]