దక్షిణాది వారికి రాజకీయ అవగాహన ఉండదు, వాళ్లలో రాజకీయ చైతన్యం తక్కువ అని ఉత్తరాదికి చెందిన వారంతా భావిస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా `రాజకీయాలకు నడకలు నేర్పింది మేమే` అన్నంత రీతిలో తెగ ఫీలయిపోతూ ఉంటారు. దక్షిణాది వారితో పోల్చితే మాకే కొంత రాజకీయ అవగాహన అని జబ్బలు చరుచుకుంటూ బీరాలు పలికేస్తారు! అయితే దక్షిణాది వారితో పోల్చితే.. ఉత్తరాది వారికి కనీస రాజకీయ అవగాహన లేదని నిరూపించేం దుకు, వారి రాజకీయ పాండిత్యం ఎంత ఉందో […]
Category: Politics
మెగాస్టార్ పొలిటికల్ కామెడీ అదిరింది!
పొలిటికల్ ఫీల్డ్‌లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఏ రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రి పదవిని అనుభవించి ఎంజాయ్ చేశారు.. ఆ తర్వాత ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం కష్టమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిరు పొలిటికల్‌గా దూరమై చాలా కాలమే అయింది. ఆయన పాలిటిక్స్ ఉన్నారంటే కూడా నమ్మడం కూడా కష్టం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నప్పటికీ.. పొలిటికల్‌గా మాత్రం ఆయన తెరవెనుకే నటిస్తున్నారు. తెర ముందు మాత్రం […]
టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు కథనాలు!
ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు విమర్శలే ఒక్కొక్కసారి పనిచేయవు.. వారిని దెబ్బకొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాలను బాగా ఒంటబట్టించుకున్న ఎల్లో మీడియా.. వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య గెలుపు ఓటములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీదనే ఆధారపడ్డాయి. ఈ వర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. అయితే, […]
కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ షాకింగ్ ట్విస్ట్
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు పెద్ద సంచలనం రేపింది. ఈ కాల్పుల కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందు విక్రమ్ గౌడ్‌పై ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే తర్వాత పోలీసుల విచారణలో అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ తనపై తానే ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేసుకున్నాడని తేల్చిచెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడేనని పోలీసులు పక్కా ఆధారాలతో తేల్చి […]
బాబు జమానాలో జగన్ గూఢచారులు?
అవును! ఏపీ సీఎం చంద్రబాబు జమానాలో వైసీపీ అధినేత జగన్‌కు గూఢచారులు ఉన్నారట! వీరు ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు ముందుగానే జగన్ అండ్‌కోకి అందించేస్తున్నారట. అంతేకాదు, ప్రభుత్వ ప్రణాళికలు, కొన్ని అతి రహస్య, అత్యంత రహస్య నిర్ణయాలను కూడా వీరు జగన్ పరివారానికి మోసేస్తున్నారట! ఈ క్రమంలోనే అనేక రహస్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగులను తొలగిస్తారని, వారికి పెరఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగనంపుతారని, పురోహితులకు జీతాలు తగ్గిస్తారని ఇటీవల జగన్ పత్రిక సాక్షిలో అనేక […]
రోజాకు బొండా ఉమా బోడి గుండు సవాల్… రోజా దిమ్మతిరిగే కౌంటర్
నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి పరాకాష్టగా మారింది. ముఖ్యంగా అటు టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా తననుతాను చిత్రీకరించుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాకి, వైసీపీ లేడీ టైగర్ రోజాకి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పొలిటికల్ హీటును పెంచేశాయి. ముఖ్యంగా నంద్యాల ఉప పోరులో చివరి ప్రచారదినం సోమవారం నాడు.. ఈ నేతలు మరింతగా రెచ్చిపోయారు. నంద్యాలలో టీడీపీ గెలుపు ఖాయమని బొండా ఉద్ఘాటించారు. ఇంత వరకు బాగానే […]
కామినేని మంత్రి పదవికి ఎసరు పెడుతోందెవరు..!
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా ? అన్న ప్రశ్నకు ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వినిపిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ, ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చల ప్రకారం కామినేని మంత్రి పదవికి ఊస్టింగ్ తప్పదన్న చర్చలు బలంగా నడుస్తున్నాయి. కామినేని శ్రీనివాస్‌ను ముందునుంచి ఏపీ బీజేపీ వాళ్లంతా చంద్రబాబు కోవర్ట్‌గా అనుమానిస్తుంటారు. గతంలో టీడీపీతో అనుబంధం ఉన్న కామినేని శ్రీనివాసరావు ఆ తర్వాత ప్రజారాజ్యం […]
వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు
రాజకీయాలు ఒకప్పుడు నేతలను బట్టి మారుతుండేవి. కానీ, ప్రస్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీలను, రాజకీయాలను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే విపక్షం వైసీపీ విశాఖపట్నంలో ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం తగాదాలు మిన్నుముట్టాయట. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులు తమ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని చేరదీయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించిన వైసీపీ.. నేతలు విశాఖలో ఈ వర్గాన్ని చేరదీశారట. […]
జట్టుకట్టనున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?
ఏపీ రాజకీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? నిన్నటి వరకు తిట్టిపోసిన వాళ్లనే అక్కున చేర్చుకుని ఆదరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయా? ఇప్పటి వరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రులకు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు ఆర్ణబ్ గోస్వామి!! రెండు పార్టీలకు ఉన్న ప్రధాన లక్ష్యాలే ఇకపై ఏపీని శాసించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]