కేంద్ర ప్రభుత్వం మూడువ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేసి తీరాల్సిందేనని రైతులు యుద్ధం ప్రకటించారు. మీకు తెలియడం లేదు.. మేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చాలా మంచి చట్టాలు తెచ్చాం.. వాటివల్ల జరిగే మేలు ఏమిటో తెలుసుకునేంత తెలివితేటలు మీకు లేవు.. మేం చెప్పినమాట విని చట్టాలను ఫాలోకండి.. అని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. రైతులు తమ యుద్ధాన్ని అంతకంటె తీవ్రం చేశారు. మా బాగు ఏమిటో మాకు తెలుసు.. మరీ […]
Category: Politics
వెనక్కి వెళ్లిన వివేకా హత్య కేసు..!
మామూలుగా అయితే శాసనసభ జరుగుతూ ఉండగా.. ఇటీవలి సంఘటనలను పరిణామాలను అన్నిటినీ బేరీజు వేసుకుంటే వివేకా హత్యకేసపు విషయంలో మాజీ డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు శంకరరెడ్డి అరెస్టు అనే వ్యవహారాలు సభలో అట్టుడికిపోతుండాలి. రాష్ట్రవ్యాప్తంగా కూడా విపక్షాల వారు అందరూ ఆ విషయాల గురించే గోలచేస్తూ ఉండాలి. కానీ ఆ చర్చ మొత్తం హైజాక్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడుకునే ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నారు. […]
వైసీపీ భ్రష్టుపట్టడానికి కొడాలినాని ఒక్కడు చాలు..!
రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అయితే ఈ విమర్శలు అనేవి అంశాలవారీగా ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రతిపక్షాల వ్యవహార సరళిమీద ఉండాలి అనే తరహా రాజకీయ విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. ఇప్పుడంతా తిట్ల పర్వమే నడుస్తోంది. ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యక్తిగత తిట్లు ఇవన్నీ కూడా చాలా సహజపరిణామాలుగా వచ్చేశాయి. వీటన్నింటినీ కూడా భరించవచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని తిట్టే తిట్లను వినడం కూడా సాధ్యం కాదు. మామూలుగానే కొడాలి నాని […]
మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్
తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో […]
ఈటల వింత వాదన
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.. అక్కడ ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచారు. అంతే.. ఈ చర్చ ఇపుడు ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులు ఈ విషయాల గురించి మాట్లాడతారు. అంతే.. అయితే గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం వింత విషయాన్ని తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం.. అందులోనూ తాను […]
చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..
కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]
ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?
కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం […]
వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?
మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]
గుర్తుందా గురూ..మరి ఇప్పుడు .. మండలితో ప్రయోజనం ఉంటుందా?
’రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉంది.. దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదు..దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం కూడా దండగ.. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది. సీన్ కట్ చేస్తే.. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.. శాసనమండలిలో 14 […]