కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీలో ఊహించని మార్పులు వస్తాయని.. జనాల్లో పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేసిన అధిష్టానానికి నిరాశే ఎదురైంది. దుబ్బాక, నాగార్జునసాగర్, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడింది. ఇక హుజూరాబాద్ లో అయితే దారుణం.. కేవలం 3వేల ఓట్లతో సరిపెట్టుకుంది. పార్టీ హైకమాండ్ హుజూరాబాద్ విషయంలో తలంటింది కూడా. ఈ నేపథ్యంలో […]

యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని […]

అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]

బాబుకు బీజేపీ నేతల సపోర్టు..

చంద్రబాబు నాయుడు.. రాజకీయ ఉద్దండుడు.. పాతసినిమాల పద్ధతిలో చెప్పాలంటే గండరగండడు..ఇప్పటి సినిమా స్టైల్లో అయితే ఒకే ఒక్కడు..అటువంటి వ్యక్తి మీడియా సమావేశంలో బహిరంగంగా వెక్కి వెక్కి ఏడ్చాడు.. రాష్ట్రం మొత్తం చూస్తుండగా.. కెమెరాలన్నీ ఆయనపై ఫోకస్ చేయగా .. కళ్లు మొత్తం చెమర్చాయి.. మొహం చేతుల్లో దాచుకొని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నాడు..దాదాపు రెండు నిమిషాల పాటు రోదించాడు.. విలేకరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. కెమెరాలు మాత్రం అన్ని యాంగిల్స్ లో బాబు బాధను షూట్ […]

ఎర్రబెల్లికి త్రెట్..బండ ప్రకాశ్ కు చాన్స్..

ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీనియర్ లీడర్.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన నాయకుడు.. ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున, ఈసారి టీఆర్ఎస్ తరపున శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంత సీనియర్ అయిన ఎర్రబెల్లికి టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు. అయితే.. కేసీఆర్ 2.0లో మాత్రం ఆ చాన్స్ దక్కింది. మంత్రి హోదా అనుభవిస్తూ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే.. ఎర్రబెల్లి మాత్రం ఇపుడు సంతోషంగా లేరు. ఎందుకంటే బండ ప్రకాశ్ రూపంలో […]

రైతు చట్టాల రద్దు.. కమలం నేతల మౌనం

రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలుచేయాలని నానా యాగీ చేసిన టీబీజేపీ నేతలు ఇపుడు ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. కేసీఆర్ పై అగ్గిమీద గుగ్గిలమయ్యే టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ మౌనముద్రం దాల్చారు. మూడు రైతు చట్టాలను రద్దుచేస్తూ రైతులకు ప్రధాన మంత్రి మోదీ క్షమాపణ చెప్పిన అనంతరం ఎందుకో స్థానిక నాయకులకు మాటలు రావడం లేదు. మోదీ ప్రకటనను ఒకటికి రెండు […]

మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల […]

కేసీఆర్ మదిలో.. ముందస్తు ఎన్నికలు

‘‘నేను ఉద్యమాలనుంచి వచ్చిన వాడిని.. పదవులు నాకు లెక్కకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశానో మీకు తెలుసు.. ’’ అని మొన్న ఇందిరాపార్కులో జరిగిన ధర్నా లో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. అంటే.. కేసీఆర్ మదిలో ఏదో ఉంది.. రాజీనామాలు చేసి ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమూ ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఏదైనా మాట్లాడారంటే దానికి ఓ లెక్క ఉంటుందని ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. వరి […]

అసెంబ్లీ ఘ‌ట‌న‌పై ఎన్టీఆర్ ఫైర్‌..వాళ్ల‌కు స్ట్రోంగ్ వార్నింగ్‌!

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నంద‌మూరి, నారా కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించ‌డం ఎవ్వ‌రూ స‌హించ‌లేక‌పోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి. ఈ మేర‌కు ఓ వీడియో పోస్ట్ చేయ‌గా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా […]