చిన్న కార్యకర్తని నిలబెట్టిన చాలు..హిందూపురంలో టీడీపీ గెలవడానికి..హిందూపురంలో ఎవరు నిలబడ్డా గెలుపు మాత్రం టీడీపీదే..మొదట నుంచి హిందూపురం టీడీపీ అడ్డాగా ఉంది..ఇంతవరకు ఇక్కడ టీడీపీ పోలేదు…టీడీపీని ఓడించడానికి ప్రత్యర్ధులు రకరకాల ప్రయోగాలు చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బాలయ్య విజయం సాధిస్తూ వస్తున్నారు. బాలయ్యని ఓడించడానికి వైసీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. 2014లో వైసీపీ తరుపున నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు..ఇక […]
Category: Politics
గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?
విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున […]
ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!
ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి. వైసీపీకి కడప, కర్నూలు, […]
రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]
టీడీపీలో పెరుగుతున్న సెగ… రాజకీయం మారుతుందా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే, గత ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్తే. ఇక.. ఆయనతో పొసగని నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి యనమలకు పిల్లి కుటుంబానికి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆయన […]
మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!
ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు. పైగా […]
గంటా…నీకో దండం స్వామి!
ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారని చెప్పొచ్చు. అసలు రాజకీయం చేసినట్లు ఉండరు గాని…ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంటుంది..ఆయన వ్యూహాలు సొంత పార్టీ వాళ్ళకే అర్ధం కావు. 2019 ఎన్నికల ముందు వరకు గంటా రాజకీయం క్లారిటీగానే నడిచింది…కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాని..ఆ పార్టీలో పనిచేయరు..అలాగే గెలిపించిన నియోజకవర్గంలోనూ […]
మాజీలని టెన్షన్ పెడుతున్న పవన్?
పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? పవన్ గాని టీడీపీతో కలిస్తే..తమకు గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? పైకి తమకు తిరుగులేదని చెప్పుకుంటున్నా…తమని జగన్ ఇమేజ్ కాపాడేస్తుందని అనుకుంటున్నా సరే..లోలోపల మాత్రం పవన్ వల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలు…ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు […]
కృష్ణాలో తమ్ముళ్ళు ఇలా ఉన్నారేంటి!
ఓ వైపు చంద్రబాబు వయసు మీద పడిన సరే…పార్టీని గాడిలో పెట్టడానికి నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు..మళ్ళీ పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి కృషి చేస్తున్నారు..అధికార వైసీపీపై తీవ్రంగా పోరాడుతున్నారు…ప్రజల్లో ఉంటూ…వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుందనే సంగతి బాబుకు అర్ధమవుతుంది…అందుకే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు ఏమో అలా కష్టపడుతుంటే…కింద ఉన్న టీడీపీ నేతలు మాత్రం అందుకు తగ్గట్టు కష్టపడటం లేదు. […]