టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్రక్షాళన చేస్తేనే తప్ప.. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఉద్దేశంలో ప్రక్షాళన అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేయడమా.. లేక విజయవాడ వరకే పరిమితం కావడమా? అనేది చర్చకు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]
Category: Politics
వైసీపీలో టాప్ లీడర్‌కు చెక్ పెట్టేస్తోందెవరు… అదిరిపోయే ట్విస్ట్..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాగా, మరొకరు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయసెగ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చర్చ కూడా మొదలైంది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు […]
లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం..బ్రేకులు పడతాయా!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు డీజీపీని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇక పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అయితే 25వ […]
కేశినేని తగ్గట్లేదు..సీటుపై రచ్చ..తమ్ముడుకు షాక్!
విజయవాడ ఎంపీ కేశినేని నాని…మరోసారి సొంత పార్టీ నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడకు చెందిన కొందరు నేతలతో కేశినేనికి ఎప్పటినుంచో పడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పట్టికప్పుడు ఆ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా మైలవరంకు వెళ్ళిన కేశినేని..దేవినేని ఉమా వ్యతిరేక వర్గంగా ఉన్న బొమ్మసాని సుబ్బారావు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ దేవినేని ఉమాపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నందిగామకు వచ్చిన కేశినేని.. తన తమ్ముడికి […]
మైలవరంలో మార్పులు.. వారు వీరు.. వీరు వారు…!
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇక్కడ అనూహ్యంగా రాజకీ య పరిణామాలు మారుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని మద్దతు పలకడం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్కడి రాజ కీయాలను వేడెక్కించాయి. దీంతో అసలు ఇక్కడ ఏం జరుగుతోందనేది ఆసక్తిగామారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు టికెట్ ఇస్తారని ప్రచా […]
పవన్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగులపై ఇదే హాట్ టాపిక్..!
“ఔను.. మేం ఆయనను నమ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయన మా వెంట ఉండాలి కదా!ఏదొ ఒకటి రెండు సమస్యలను ఇలా టచ్ చేసి అలా వెళ్లిపోతే.. మా పరిస్థితి ఏంటి? తర్వాత మేం ఎవరితో చెప్పుకోవా లి? .. రోడ్లన్నారు.. ఏదో వచ్చారు. అలా హడావుడి చేశారు వెళ్లిపోయారు. తర్వాత.. ఎస్సీలపై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మరి ఎలా నమ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్‌లైన్ చానెల్ నిర్వహించిన సర్వేలో జనసేన అధినేత […]
చంద్రబాబును వర్మ ఎందుకు వదలట్లేదు… మరో సినిమా కూడా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏపీ వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర రాజకీయ యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువచ్చిన జీవో 1/2023 మరింతగా రాజకీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్రబాబు కుప్పం టూర్‌పై ఇప్పుడే కాదు గతంలోనూ వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా ఆంక్షలే వచ్చాయి. తాజాగా జగన్ సర్కార్ తెచ్చిన జీవోపై […]
టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల లెక్కల్లో కొత్త ట్విస్ట్?
టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి..అధికారికంగా ఇంకా పూర్తి ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తుపై రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. తాజాగా పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఓ వ్యూహం కావాలని, టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు భరోసా ఇచ్చి తనకు అండగా నిలబడితే ఒంటరిగా వెళ్లడానికైనా రెడీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదని, గత ఎన్నికల్లో అలాగే ప్రజలని […]
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే..కొత్త సీటు ఫిక్స్?
గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వారి స్థానాల్లో సొంత పార్టీ నేతలతో ఆధిపత్య పోరు నడుస్తున్న పరిస్తితి. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..సొంత పార్టీపైనే అసంతృప్తిగా ఉన్నారని, ఈయన టీడీపీలోకి వస్తారని ప్రచారం ఉంది. మైలవరం […]