నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు. పెట్టుబడులు రావాలంటే కంపెనీలు ముఖ్యం కనుక.. నిత్యం పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా ఇమేజ్ కన్నా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది. వరుసగా కంపెనీలు ఏపీకి క్యూ కట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వరుసగా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూసేయడం.. అమరావతి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాలని […]
Category: Latest News
టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు..?
తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన.. త్వరలో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్రచారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయన తమ్ముడు నల్లారి కిషోర్‌కుమార్ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అతి త్వరలోనే పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఆయన చేరికకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని […]
నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరికతో మొదలైన విభేదాలు.. ఆయన మరణం తర్వాత కూడా చల్లారడం లేదు. భూమా హఠాన్మరణంతో అక్కడ జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వర్గాల మధ్య విభేదాలతో తీవ్రంగా నలిగిపోయిన అధినేత చంద్రబాబు.. చివరకు వీటిని సద్దుమణిగేలా చేశారు. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా శిల్పా వర్గానికి […]
బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్ఠానం దక్షిణాధి రాష్ట్రాలపై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్యలను మొదట పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియస్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో.. ఆయనలో గుబులు మొదలైందట. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ వ్యూహాలకు చెక్ […]
టీటీడీ చైర్మన్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ
టీటీడీ చైర్మన్ పదవి ముగుస్తున్న కొద్దీ.. తిరుమల శ్రీనివాసుడి కటాక్షం ఎవరిపైన ఉంటుందనే చర్చ టీడీపీలో జోరందుకుంది. ముఖ్యంగా ఈ పదవిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే! ఈమేరకు ఆయన ఇప్పటికే మంతనాలు కూడా జరుపుతున్నారు. కమ్మ సామాజిక వర్గం కూడా ఆయనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మంత్రి పదవి ఆశించి భంగపడిన గాలి ముద్దు కృష్ణమనాయుడికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించే […]
పవన్ నీ ప్రశ్నల్లో నిజాయితీ ఎక్కడ..!
ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ సినిమాల వరకు పవర్‌స్టార్ అయినా పొలిటికల్‌గా ఇంకా ఏ స్టారో చెప్పలేని పరిస్థితి. పవన్ నీతి, నిజాయితీ ఆయనకు ప్లస్ కావొచ్చేమో గాని, అవి పొలిటికల్‌గా సెకండ్ కేటగిరిలో ఉన్నాయి. కానీ పొలిటికల్‌గా పవన్ తన పవర్ చూపిస్తాడని అందరూ అనుకుంటుంటే ఆయన చేస్తోన్న రాజకీయం మాత్రం ఆయన సినిమాల్లాగానే రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పవన్ న్యూస్ పేపర్లను, వార్తలను బాగానే ఫాలో అవుతాడు. ఆయనకు […]
వైసీపీలోకి రఘువీరా…జగన్ ఆఫర్ ఇదేనా..!
రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీ నెత్తిమీదే పడడంతో ఆ పార్టీ ఇప్పటకీ కోలుకునే పరిస్థితి లేదు. విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్‌కు ఏ నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చాయో భూతద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటకీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్కడక్కడా ఉన్నా ? పార్టీని నడిపించే నాయకుడే సరైన వాడు లేకుండా పోయాడు. […]
పెద్దల ఆశలకు బీజేపీ నేతల గండి
తెలంగాణ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆధిపత్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని పరుగు పెట్టించాల్సిన ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయబేధాలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనాసభా పక్ష నేత కిషన్ రెడ్డి కేంద్రాలుగా రెండు పవర్ హౌస్‌లు ఏర్పడుతు న్నాయని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని అధిష్ఠాన పెద్దలు ఆశలు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశలకు […]
2019కి టీడీపీలో సీనియర్లు అవుట్
తెలుగు దేశం పార్టీని తమ భుజ స్కందాలపై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియర్ల శకం ఇక ముగిసినట్టే అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీలో యువ నాయకత్వం పెరగబోతోందనే సంకేతాలు.. మంత్రి వర్గ విస్తరణ ద్వారా స్పష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నికల సమయానికి అంతా చినబాబు లోకేష్ సారథ్యంలోకే వెళ్లవచ్చనేది కూడా స్పష్టమవుతున్న తరుణంలో.. ఇక సీనియర్లకు ఉద్వాసన తప్పదనే […]
