ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు పవన్!! ఇలా చెప్పి మూడేళ్లు పూర్తయింది. అడపాదడపా రావడం.. ఆవేశంగా మాట్లాడటం.. కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం.. తనపై విమర్శలు చేసిన వారికి ఒకేసారి బదులు చెప్పడం.. ఏదైనా సంఘటన జరిగినపుడు ట్విటర్‌లో నాలుగు ముక్కలు రాసేయడం.. మినహా ఈ మూడేళ్లలో పవన్ పెద్ద విజయాలు సాధించలేదనే చెప్పాలి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఆయనపై పొలిటికల్ ఎంట్రీపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. ప్రజల సమస్యలపై సమరశంఖారావం పూరిస్తారని […]
Category: Latest News
కేంద్రం నియోజకవర్గాల పెంపు…బాబుకి కొత్త జిల్లాల డిమాండ్
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే నియోజకవర్గాల పెంపు అంశం తెరపైకి వచ్చింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన అంశాన్ని కేంద్రం పక్కన పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల సమయానికే నియోజకవర్గాలను పెంచాలని కేంద్రం నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే.. నియోజకవర్గాలే గాక.. ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 13 […]
నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిపత్య పోరు
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీకి చుక్కెదురయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామని నేతలు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్రతిపక్షానికి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం! ముఖ్యంగా తమ అభ్యర్థుల విజయం కోసం మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో తమ […]
అఖిల్ ప్రియ ఎంట్రీతో ఎవరికి చెక్..!
తండ్రికి దక్కనిది కూతురికి దక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో.. ఆయన అనుచరులను తీవ్రంగా కలిచివేస్తోంది. మంత్రి వర్గంలో చేరాలనే కోరిక.. తీరకుండానే ఆయన కన్నుమూశారు! దీంతో ఇప్పుడు ఆయన కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో కేబినెట్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తే.. ఇప్పుడు ఎవరికి చెక్ చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు మహిళలు మంత్రులుగా కేబినెట్లో ఉన్నారు. మరి అఖిలప్రియకు […]
కాంగ్రెస్ పీఎం అభ్యర్థిగా శశిథరూర్..!
125 ఏళ్ల ఘన చరిత్ర ఇప్పుడు కనుమరుగు అయిపోయింది! ఎందరో గొప్ప నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఒకే ఒక్క నాయకుడి కోసం వెతుకుతోంది!! మరో పక్క ప్రధాని మోదీ బలం రెట్టింపు అవుతుంటే.. కాంగ్రెస్ భావి సారథి ఇంకా ఇంకా అథఃపాతాళానికి పడిపోతున్నారు. మరి 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను ప్రకటిస్తే అది పార్టీకి నష్టమని ఇప్పటికే అందరికీ అర్థమైంది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పీఎం అభ్యర్థిగా ఎంపీ శశిథరూర్ […]
గంటా వివాదాస్పద నిర్ణయం తెలిస్తే షాకే
`వడ్డించే వాడు మనవాడైతే… ` అనే నానుడిని గుర్తుచేస్తున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు! ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. మరో కొత్త సంస్కృతికి తెరతీశారు! తనకు నచ్చిన వారికి ఎన్ని పదవులనైనా కట్టబెట్టి అందల మెక్కించేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తేలికగా కొట్టిపారేస్తున్నారు. మంత్రుల వద్ద అధికారులుగా పనిచేసే వ్యక్తులు.. మరే ఇతర శాఖల్లోనూ పనిచేయకూడదు. కానీ గంటా శ్రీనివాసరావు శాఖలో మాత్రం ఇది వర్తించదని రుజువైంది. తన పీఎస్‌గా వ్యవహరిస్తున్న నాయుడుని.. రాజీవ్ విద్యామిషన్ […]
ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్
ఒక్క విజయం ఎంతోమందికి సమాధానం చెబుతోంది. ఒక్క విజయం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. ఒక్క విజయం.. నాయకుడిని శక్తిగా నిలిపింది!! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విజయం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి! 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని తుంగలో తొక్కారు! దక్షిణాదిలో ఏపీపై పట్టు సాధించాలని.. రాష్ట్రానికి […]
వైసీపీ టార్గెట్‌గా చంద్రబాబు వ్యూహం… ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి !
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ నేతల ఎత్తులను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం రచిస్తోంది. సుమారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మరణాలు, పశ్చిమగోదావరిలో ఆక్వాపార్కు తదితర ప్రధాన సమస్యలపై చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విషయం […]
యూపీ ఎఫెక్ట్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు
యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు దేశమంతా మొదలైంది. ప్రధాని మోదీని ఢీ కొట్టడం ఇక అసాధ్యమన్న విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. అందుకే ఇప్పటినుంచే తమ వ్యూహాలు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు నాయకులు. ముఖ్యంగా దూరదృష్టిగల తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఇప్పుడు యూపీ ప్రభావం పడింది. అందుకే సంచలన నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై పడకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహానికి […]