`అమరావతికి వాస్తు బాగుంది. ఏ పని చేపట్టినా విజయమే` ఇది ఏపీ సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పదేపదే ఈ విషయాన్నిఅట్టహాసంగా చెబుతుంటారు. ప్రతి కార్యక్రమానికి అమరావతి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. తన అనుభవాన్ని అంతా రంగరించి అమరావతికి ప్రత్యేకమైన బ్రాండింగ్ చేపట్టే పనిలో పడ్డారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్రబాబు `అమరావతి` సెంటిమెంట్ మాత్రం వర్కవుట్ కావడం లేదని వినిపిస్తోంది. `ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం శుభసూచకం`.. […]
Category: Latest News
టీడీపీకి షాక్: ఆ కీలక నేత పార్టీ వీడతాడా..!
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసకందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వర్గం, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వర్గం పార్టీ మారే అలోచనతో ఉంటే.. ఇప్పుడు గంగుల వర్గం కూడా దాదాపు పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇక రేపో మాపో అన్నట్లు […]
మహిళా పార్లమెంటు వేదికగా.. బ్రాహ్మణి మామ గొప్పలు!
విపక్షాలు గొంతు చించుకుంటున్నదే నిజమా? అని అనిపించే విధంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి. విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన మహిళా పార్లమెంటుకు శనివారం హాజరైన ఆమె.. మైకు పుచ్చుకున్న దగ్గర నుంచి తన మామ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తడానికే ప్రియార్టీ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన గత పదేళ్ల కాలం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అన్ని పథకాలను పేర్లతో సహా పేర్కొన్న బ్రాహ్మణి.. మామ పొగడడంతో కోడలు మించి పోయిందనే కీర్తిని మూటగట్టుకున్నారు. […]
మహిళా పార్లమెంటుపై రోజా పగ తీర్చుకుందా?!
ఏపీ సీఎం చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు విషయంలో ఆది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా.. శనివారం పెద్ద రచ్చ సృష్టించి చర్చకు దారితీసింది. మహిళా పార్లమెంటు ఆహ్వానం మేరకు శనివారం ఆమె గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి పార్లమెంటు జరిగే మహా సంగమ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, విమానాశ్రయంలోనే ఆమె పోలీసులపై విరుచుకుపడింది. బౌద్ధ గురువు దలైలామా […]
చిన్నమ్మ కోటరీకి బీటలు! విద్యా మంత్రి పన్నీర్ గూటికి జంప్!
తమిళనాట రాజకీయాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు తిరుగులేదని అనుకున్న చిన్నమ్మ.. ఆశలు ఒక్కసారిగా ఆవిరవుతున్నాయి. పన్నీర్ సెల్వాన్ని విజయవంతంగా సీఎం సీటు నుంచి రాజీనామా చేయించిన చిన్నమ్మ శశికళ.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంతలో కథ అడ్డం తిరిగింది. పన్నీర్ తిరుగుబావుటా ఎగురేశారు. దీనికి వెనుక ఎవరున్నారు? ముందు ఎవరున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా […]
ఆంధ్రాలో తెలంగాణ వాదం వదిలేసిన ఎంపీ కవిత..!
తెలంగాణ ప్రాంతీయ వాదం, సాహిత్యాన్ని, కళలను, సంస్కృతి. సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత ఎప్పుడూ ముందుంటారు. ఏ వేదిక అయినా, ఎక్కడయినా ఆమె ఈ అంశాలపై అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఇప్పుడు అమరావతిలో ఏర్పాటుచేసిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరైన ఆమె.. తన ప్రసంగంలో ఎక్కడా వాటి జోలికి పోవడం చర్చనీయాంశమైంది. మరి ఎక్కడయినా తెలంగాణ వాదాన్ని భుజాన కెత్తుకునే ఆమె.. ఈసారి అలా చేయకపోవడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని […]
టీ టీడీపీలో ముదిరిన ముసలం
తెలంగాణ తెలుగుదేశంలో ముసలం ముదిరిపోయింది. నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొంతకాలంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై ప్రెసిడెంట్ ఎల్.రమణ తీవ్రంగా అసహనానికి గురవుతున్నారు. దీంతో ఆయన సైకిల్ దిగి కారెక్కే సూచనలు ఉన్నాయని పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోందట. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైపోయిందట. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్రబెల్లితో రమణ ప్రత్యేక సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో గులాబీ దళంలో క్లారిటీ వచ్చిందట. […]
హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..
గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్‌పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్‌పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]
పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్రజల మనసు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఒకరు దృఢ నిశ్చయంతో ఉంటే.. మరొకరు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి భావి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ వ్యూహాలతో మునిగితేలుతూ.. బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా గుంటూరులో పవన్ పర్యటిస్తుండటంతో.. అంతకు ముందుగానే జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో మరోసారి ఆసక్తికర […]