గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆ తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తనతో పాటు మిర్యాలగూడ ఎంపీని సైతం ఆయన టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనపై వేటు పడుతుందనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ… ఒక్క విషయంలో మాత్రం ఆయన మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరే సమయంలోనూ ఆ […]
Category: Latest News
నంద్యాల బై పోల్ ఏకగ్రీవం వెనక విజయమ్మ..!
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్.. నంద్యాల ఉప ఎన్నిక! ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్యమైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. తర్వాత పొలిటికల్ కారణాల నేపథ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్కడం.. అనూహ్యంగా ఆయన మరణించడం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీలకు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. తమ పార్టీ సీటే కాబట్టి బైపోల్లో పోటీ చేసే అర్హత తమకే ఉందని […]
కాంగ్రెస్ సభ ఎఫెక్ట్… పెరిగిన జగ్గారెడ్డి ఇమేజ్
అంతకుముందు వరకు ఆయనను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా… ఆయన తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర బలంగా ఉండేది. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన జగ్గారెడ్డి… మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ సంగారెడ్డిలో భారీ సభను ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన తరువాత జగ్గారెడ్డి […]
టీడీపీ కంచుకోటలో ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా..!
వెస్ట్ గోదావరి అంటేనే టీడీపీకి బలమైన కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నాడంటే అందుకు వెస్ట్ గోదావరే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు, 2 ఎంపీలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ప్రస్తుతం జిల్లాలో కొందరు ఎమ్మెల్యల పనితీరుతో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ముగ్గురు సిట్టింగ్ […]
మంత్రి ఆదికి లోపలో శత్రువు…బయటో శత్రువు
మంత్రి ఆదినారాయణరెడ్డిది మామూలు లక్ కాదు. కడప జిల్లాలో జగన్‌కు అత్యంత నమ్మినబంటుగా ఉన్న ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి జంప్ చేయడం, ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి హవా ఓ రేంజ్లో కంటిన్యూ అవుతోంది. జిల్లా రాజకీయాలను ఆయన శాసిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి ఇరువైపుల నుంచి మద్దెలదరువు తప్పేలా లేదు. ఆయన లోపలో శత్రువు, బయటో శత్రువును ఎదుర్కోకతప్పేలా లేదు. జమ్మలమడుగు టీడీపీ రాజకీయాల్లో […]
వైసీపీ లో ఘంటా పొలిటికల్ ఫ్యూచర్ ఎటు..!
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఘంటా మురళీ రామకృష్ణ (మురళీ) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ సమైక్యాంధ్ర రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావును ఓడించిన ఓ సంచలన వ్యక్తిగా మాత్రం ఘంటా మురళీ తెలుసు. అతి సామాన్యుడైన మురళీ 2004లో ఐదుసార్లు గెలిచిన తలపండిన రాజకీయవేత్త, దివంగత మాజీ మంత్రి కోటగిరిని ఓడిచి పెద్ద సంచలనం సృష్టించారు. 2004లో చింతలపూడి ఎమ్మెల్యే అయిన మురళీ ఆ తర్వాత అది రిజర్వ్ కావడంతో కిరణ్‌కుమార్ […]
టీటీడీపీలో మరో ఎమ్మెల్యే జంప్..?
రుణ శేషం..శత్రు శేషం ఉండరాదనేది ఓ నానుడి. ఇదే విధానాన్ని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అమలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీనీ కోలుకోలేని దెబ్బతీసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీకి మిగిలిన ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి లాక్కునేందుకు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్లాన్ వేసిందన్న చర్చలు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో టీడీపీని దాదాపు ఖాళీ చేసేసిన గులాబీ పార్టీ తాజాగా అక్కడ పసుపు పార్టీని అందరూ మర్చిపోయేలా చేసే పనిలో బిజీగా ఉన్నట్టు […]
12 మంది ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తే అటు పక్కన ఎలాంటి వారున్నా ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఏపీలో నవనిర్మాణ దీక్షను ప్రారంభించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షకు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు డుమ్మా కొట్టారు. తాను ఎంతో సీరియస్‌గా ఈ దీక్షలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గోవాలని పిలుపునిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తన మాట పట్టించుకోకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలోని తన […]
తెలంగాణ భూ కుంభకోణంలో కేసీఆర్ మంత్రి
తెలంగాణలో భూ అక్రమార్కులు చెలరేగారని, సబ్ రిజిస్ట్రార్లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డగోలుగా సహాయం చేశారని వార్తలు అందాయి. ఈ వ్యవహారంలో టీ మంత్రుల హస్తం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్.. వెంటనే ఏసీబీని రంగంలోకి దింపారు. అసలు విషయం ఏంటో అంతు తేల్చాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారని, అవినీతిలో పేట్రేగిపోయారని […]
