తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం టీవీ9! అప్పటివరకూ ఉన్న సంస్కృతికి భిన్నంగా నిరంతరం వార్తలు అందిస్తూ.. టీవీ గతిని మార్చిన చానల్ ఇది! బ్రేకింగ్ న్యూస్‌లతో అక్రమార్కులను పరుగులెత్తించిన చానెల్! తెలుగులోనే మొదలై.. ఇతర భాషలకు విస్తరించి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మారిపోయింది. టీవీ9 యాజమాన్యం మారబోతోందని, దీనికి అమ్మకానికి పెట్టారన్న ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇవి వాస్తవేమని బిజినెస్ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. దీనిని చేజిక్కించుకునేందుకు నాలుగు బడా కంపెనీలు […]
Category: Latest News
అక్కడ వైసీపీకి దిక్కెవరు?
ప్రస్తుతం ఈ ప్రశ్న పలువురిని కలిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలను ఉక్కిరిబిక్కరికి గురి చేస్తోంది. వైసీపీని జగన్ వదిలేశారా? అంటూ తమలో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన రాజకీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని తలపడి తెలుగు నేలపై సొంతంగా ఏర్పడ్డ పార్టీ కూడా ఇదొక్కటే. తాను కోరుకున్న సీఎం పదవి దక్కకపోవడంతో […]
జగన్ కోట్లు పెట్టి తెచ్చుకున్న పీకే.. బాబుకు జై కొడతాడా..?
ఎట్టి పరిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవసం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో తనకు ఎలక్షన్ సలహాదారుగా ఉత్తరాది నుంచి కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిశోర్‌ను దిగుమతి చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో మీద ఓ సర్వే చేయించాడు. ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాలు, జనసేనాని దూకుడు.. కాంగ్రెస్ వామపక్షాల గాలి వంటి వివిధ అంశాలపై ఆయన తన దైన స్టైల్‌లో […]
టీడీపీలో నేడు ఐవైఆర్…రేపు వేటు ఎవరిపైనో..!
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావుపై ప్రభుత్వం వేటు వేయడం టీడీపీ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. కృష్ణారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టులను షేర్ చేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనందసూర్యను నియమించింది. ఏదేమైనా చంద్రబాబు గీత దాటుతోన్న, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటోన్న వారి […]
ఏపీలో అవినీతి సునామీ.. ఎవరిని పట్టుకున్నా కోట్లే కోట్లు!!
గత కొన్నాళ్లుగా ఏపీలోని తెలుగు దినపత్రికల్లో.. ఏసీబీకిన ఇంజనీర్. ఏసీబీకి చిక్కిన డీటీసీ.. ఏసీబీకి చిక్కిన ఎంఆర్వో.. ఇలా రోజూ ఏదో ఒక అవినీతి వార్త కనిపిస్తూనే ఉంది. పోనీ దీనీని లైట్‌గా తీసేద్దామా? అంటే.. అలా పట్టుబడిన వారి నుంచి ఏసీబీ స్వాధీనం చేసుకుంటోంది ఏ వేలో లక్షలో కావు.. పదులు.. వందల కోట్లు!! కిలోలకు కిలోలు బంగారం, వెండి వస్తువులు. ఖరీదైన ఫర్నిచర్.. ఫారిన్ లిక్కర్ బాటిళ్లు!! మరి ఇంతలా అవినీతి నిత్యం పారుతున్న […]
మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జగన్
ప్రత్యేకహోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకునపెట్టే అవకాశాన్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వచ్చేది లేదని, అందులో ఉన్నవన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామని మభ్యపెడుతున్న వైసీపీ.. తమకు ఏపీ ప్రజల ప్రయోజ నాల కంటే తమ సొంత ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ తలాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు […]
అప్పట్లో పరకాల, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు మేధావుల అవసరం ముఖ్యం! ఇది గమనించే కొంతమందిని కీలక పదవుల్లో నియమిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి రివర్స్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఇలాంటి పరిణామమే ఏపీ రాజకీయాల్లో ఎదురైంది. సీఎం చంద్రబాబు.. ఏరికోరి నియమించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్రభుత్వంపై ఎదరుదాడికి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయనపై వేటు వేసే వరకూ వ్యవహారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘటనే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో […]
ఐవైఆర్ సునామీ… బాబుకు ఝలక్..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!
ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధారణం అనదగిన పరిణామాలు వెంటవెంటనే చోటు చేసేసుకుంటున్నాయి. తన మామకు వెన్నుపోటు పోడిచాడు అని విపక్షాలు సీఎం చంద్రబాబును తరచు విమర్శిస్తూ ఉంటాయి. దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నేరుగా చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో బాబు అవాక్కయిపోవడం తరువాయి అయింది. నిజానికి ఈ పరిణామం ఏ కమ్మ, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మరో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మణ కులం […]
మోడీ మెగా ప్లాన్: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!
2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఢిల్లీ పీఠం వరుసగా రెండోసారి అధిష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేస్తోన్న ఎత్తులు, పన్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో మోడీ అనుసరించిన వ్యూహానికి విపక్షాల నుంచి విమర్శలకు తావే లేకుండా పోయింది. దీంతో ఆయనతో విబేధించే మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అనలేని పరిస్థితి మోడీ కల్పించారు. ఇక్కడ ఎవ్వరు విమర్శించినా దళితుడు రాష్ట్రపతి అవ్వడం ఇష్టం లేదా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. […]
