ఏపీ బీజేపీలో ఒంట‌రైన వీర్రాజు

ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్ర‌పక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మ‌ధ్య క్షేత్ర‌స్థాయిలో పొస‌గ‌డం లేద‌న్న‌ది నిజం. ఏపీ బీజేపీ చంద్ర‌బాబు అనుకూల‌, చంద్ర‌బాబు వ్య‌తిరేక వ‌ర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్ర‌బాబు వ్య‌తిరేక‌వ‌ర్గంలో ఆయ‌న్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్ల‌లో రాజ‌మండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫ‌స్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్‌తో ఇక్క‌డ టీడీపీ, చంద్ర‌బాబుపై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న‌కే ఏపీ బీజేపీ ప‌గ్గాలు అన్న […]

పాల్వాయి మ‌ర‌ణం వాళ్ల‌కు రిలీఫ్‌…. ఈయ‌న‌కు మైన‌స్‌

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్లో చెర‌గ‌ని ముద్ర వేస్తూ వ‌స్తోన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్క‌డ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. పాల్వాయి మృతి తెలంగాణ రాజ‌కీయాల్లో కొంద‌రికి రిలీఫ్ అయితే మరికొంద‌రికి మైన‌స్‌గా మార‌బోతోంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ […]

టీఆర్ఎస్‌లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీలు

రాజ‌కీయ పార్టీ అన్నాక ప్ర‌జాప్ర‌తినిధులు నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబ‌ట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఇలాంటి ఆధిప‌త్య పోరే న‌డుస్తోంది. మంత్రులు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ కోల్డ్‌వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వ‌ర్సెస్ ముగ్గురు ఎంపీల మ‌ధ్య జ‌రుగుతోంది. పాల‌మూరు జిల్లాలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిప‌త్యం చెలాయిస్తుండ‌డం […]

రాజ‌మండ్రి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా ఊహించని కొత్త వ్యక్తి..!

ఏపీలోని రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌న‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే సూచ‌నాభిప్రాయంగా వెల్ల‌డించేశారు. వ‌యోభారం రీత్యా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరమ‌వ్వాల‌నుకుంటోన్న ముర‌ళీమోహ‌న్ తాను త‌ప్పుకుని ఆ స్థానంలో త‌న కోడులు రూపాదేవిని అక్క‌డ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. ముర‌ళీమోహ‌న్ ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్ర‌కుమార్ పేరును […]

జ‌గ‌న్‌ను ఓవ‌ర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!

ఏపీలో 2019 ఎన్నిక‌లు విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జ‌గ‌న్ గెల‌వ‌క‌పోతే జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ చాలా డేంజ‌ర్ పొజిష‌న్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్ లాంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త వ్యూహాల‌ను సైతం అమ‌లు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీ+ జ‌న‌సేన+కామ్రేడ్ల‌తో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌తో చెప్పిన‌ట్టు కూడా ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో ప్ర‌చారం […]

పాలిటిక్స్‌లో ర‌జ‌నీకి మైన‌స్‌లు ఎక్కువే…!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ త‌మిళ‌నాడును హీటెక్కిస్తోంది. ర‌జ‌నీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తే అక్క‌డ రాజ‌కీయంగా ఎవ‌రికి ఎంత ప్ల‌స్‌, ఎంత మైన‌స్ అన్న లెక్క‌లు ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యాయి. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ సైతం ర‌జ‌నీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నాయి. బీజేపీతోనే క‌లిసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని ర‌జ‌నీ ఇటీవ‌ల వ‌చ్చిన కాంగ్రెస్ ఆఫ‌ర్‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు […]

కూక‌ట్‌ప‌ల్లిలో కృష్ణారావుకు అందుకే షాకిచ్చారా?!

కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే.. మాధ‌వ‌రం కృష్ణారావు కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు ప‌డ్డారు. అయితే, కొన్ని పొలిటిక‌ల్ రీజ‌న్స్ వ‌ల్ల ఆయ‌న టీఆర్ ఎస్‌లో కి జంప్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో కృష్ణారావు మార్కులు త‌గ్గిపోయాయి. వాస్త‌వానికి ఆయ‌నకు ప్ర‌జ‌ల్లో మంచి మార్క‌లు ఉండ‌గా.. కేసీఆర్ స‌ర్వేలో మాత్రం ఎందుకు మార్క‌లు త‌గ్గాయి? […]

కేటీఆర్‌పై విపక్షాల దాడికి స‌బ్జెక్ట్‌ రెడీ!

తెలంగాణ‌లోని విప‌క్షాల‌కు మంచి స‌బ్జెక్ట్ దొరికింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ వ‌చ్చిన విప‌క్షాల‌కు ప్ర‌స్తుతం కేటీఆర్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి హైద‌రాబాదే సాక్ష్యం! నిజానికి భాగ్య‌న‌గ‌రం అన్న పేరే కానీ.. ఇక్క‌డంతా అభాగ్య‌మే రాజ్య‌మేలుతోంది. చిన్న‌పాటి వ‌ర్షానికే సెక్ర‌టేరియ‌ట్ స‌హా న‌గ‌రానికి న‌డిబొడ్డున ఉన్న అమీర్ పేట సైతం మోకాలు లోతు నీళ్ల‌లో పైకితేలుతూ ఉంటుంది. అలాంటి దుస్తితి వ‌ల్ల ఇక్క‌డి ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ప‌రిస్తితి అయితే […]

మియాపూర్ భూ కుంభకోణం… డిప్యూటీ సీఎంకు చెక్

మియాపూర్ భూ కుంభ‌కోణం.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ కుంభ‌కోణంలో పెద్ద‌ల పాత్ర ఉందంటూ.. ఇప్ప‌టికే అత్యంత కీల‌క‌మైన కేసుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు టీడీపీ ఏపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి అరెస్టు ఉదంతం మ‌రింత ఊపు తెచ్చింది. ఇక‌, సాధార‌ణంగా పైపైనే శోధిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీ స్థాయి వ్య‌క్తిని అరెస్టు చేశారంటే.. దీనిని మ‌రింత సీరియ‌స్‌గా శోధిస్తే.. ఇంకెంత మంది బ‌డా బాబులు బ‌య‌ట‌కు వ‌స్తారో క‌దా! ఇప్పుడు ఇదే విష‌యంపై తెలంగాణ‌లో […]