విజయ్ ఆంటోనీ భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్ ఇంకా చిత్ర నిర్మాత కూడా. తన తొలి చిత్రం 2012 లో నాన్ అయినప్పటికీ అతను సలీం, పిచైకరన్, సైతాన్ , యమన్, కొలైగరన్ వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం విజయ రాఘవన్. ఇందులో ఆత్మిక హీరోయిన్‌గా నటించారు. ఆనంద్ కృష్ణన్ […]
Category: Latest News
జీడిమెట్లలో కలకలం.. గన్ తో బెదిరించి..
హైదరాబాద్ నగరం అభివృద్ధిలోనే కాదు నేరాలలోనూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. మహా నగరంలో గన్ సంస్కృతి విస్తరిస్తున్నది. ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కొందరు.. సులువుగా డబ్బును సంపాదించుకునేందుకు మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. చోరీలకు తెగబడుతున్నారు. అలాంటి సంఘటన తాజాగా జీడిమెట్లలో వెలుగుచూసింది. బాధితుడు, అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. జీడిమెట్ల అయోధ్య నగర్లో గత ఎనిమిది సంవత్సరాలుగా రవి అనే వ్యక్తి నగదు బదిలీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9:30 […]
నటుడు వివేక్ హఠాన్మరణంపై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు!
కోలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ నేటి ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే వివేక్ హఠాన్మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ […]
మరో బాలీవుడ్ డైరెక్టర్‌కు ప్రభాస్ గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే ప్రకటన?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్`, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో `సాలర్` మరియు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. సలార్, ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా సమాచారం ప్రకారం..మరో ప్రాజెక్ట్‌ను ప్రభాస్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు […]
అఖండ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. అఖండ మూవీ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ సాధించింది. తాజాగా అఖండ యూనిట్ మొత్తం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. […]
ఆటో డ్రైవర్‌కు సమంత సర్ప్రైజ్ గిఫ్ట్..?
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్ వచ్చిన కవితకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయింది. ఆ తరువాత గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా, అక్కడి నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారును ఆమెకు అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన […]
అశోకవనంలో టాలీవుడ్ యంగ్ హీరో `కళ్యాణం`!
`ఈ నగరానికి ఏమైంది` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. `ఫలక్ నామా దాస్` సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన `పాగల్` అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిఫరెంట్ టైటిల్‌తో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. అదే `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ […]
సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
ఆర్ఎక్స్ 100 చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మహాసముద్రం. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు యాక్టర్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం […]
మరోసారి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు…!?
మాజీ మంత్రి అయిన దేవినేని ఉమకు మరోకసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. ఈ నెల 19న కర్నూల్ సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలంటూ దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసి పంపించారు. నిన్న విచారణకు హాజరైయ్యేందుకు 10 రోజులు వ్యవధి కావాలంటూ దేవినేని ఉమా వారిని కోరారు. అయితే, సీఐడీ మాత్రం రెండు రోజులు సమయం మాత్రమే ఇచ్చింది. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన క్రమంలో సీఐడీ […]