అమెజాన్‌లో `ఏక్‌ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌!

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. విడుద‌ల వాయిదా వేశారు. ఇక క‌రోనా క‌నిక‌రించే ప‌రిస్థితులు ఇప్ప‌ట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీ విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది.

ఇందులో భాగంగానే..ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ చిత్రం స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమాను మే 27న రిలీజ్‌ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటిస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

Image