బాల‌కృష్ణ సినిమాలో లేడీ వ‌ర‌ల‌క్ష్మి కీ రోల్‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ మంచి జోరుమీదున్నారు. ఆయ‌న త‌న పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 107వ సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ డైరెక్ట‌ర్ అయిన గోపీచంద్ మ‌లినేనితో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ ఈ మూవీని చేస్తున్నారు బాల‌య్య‌. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. ర‌వితేజ క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించి మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ గుర్తుంది క‌దా. ఆమెనే ఇప్పుడు ఇందులో […]

దర్శకురాలిపై కేసు..?

ఇప్పుడు రాజ‌ద్రోహం కేసులు అనేవి వరుస‌గా వినిపిస్తున్న పేర్లు. ఒక వైపు సుప్రీంకోర్టులో దీనిపై దర్యాప్తు జ‌రుగుతుండ‌గానే మరో దిక్కు లక్షద్వీప్ పోలీసులు సినీ నటిపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. లక్షద్వీప్‌‌నకు చెందిన సినీ నిర్మాత క‌మ్ డైరెక్ట‌ర్ అయిన ఆయిషా సుల్తానాపై స్థానిక పోలీసులు దేశద్రోహం కేసు ఫైల్ చేశార‌ని తెలుస్తోంది. స్థానిక బీజేపీ అధ్యక్షుడు అయిన సి. అబ్దుల్ ఖాదిర్ అయిషా సుల్తానాపై చేసిన ఫిర్యాదు ప్ర‌కారం పోలీసులు ఈ కేసు న‌మోదు […]

అప్పుడే పెళ్లి.. వైర‌ల్‌గా తాప్సీ కామెంట్స్!

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన తాప్సీ.. ఇక్క‌డ ప‌లు చిత్రాలు చేసిన త‌ర్వాత బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న తాప్సీ.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథ్యూస్‌తో తాప్సీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్తలు వ‌స్తూనే. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా […]

ప్ర‌భాస్ బ‌డా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామ‌కు అదిరే ఆఫ‌ర్‌!?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న బ‌డా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒక‌టి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీల‌క‌ పాత్ర పోషించ‌నున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. […]

ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!

టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత అక్కినేని ఇటీవ‌లె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స‌మంత‌.. ప్రేక్ష‌కులను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ప్ర‌స్తుతం బీటౌన్‌లో స‌మంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

రియా చక్రవర్తికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ద్రౌపదిగా మెర‌వ‌నున్న బ్యూటీ?!

బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత రియా పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే స‌మ‌యంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న రియా కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో ఉంది. దీంతో ఆమె కెరీర్ ముగిసింద‌ని అంద‌రూ భావించారు. కానీ, రియా మ‌ళ్లీ సినీ రంగంలోకి బిజీ కావ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమెకు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు […]

రిలీజ్‌కు ముందే ర‌వితేజ మూవీపై క‌న్నేసిన సల్మాన్..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయ‌ర్ రోల్ చేస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుద‌ల కాకుండానే.. ఈ సినిమాపై క‌న్నేశాడు బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఖిలాడీ టీజ‌ర్‌కు స‌ల్మాన్ […]

సైకో కిల్ల‌ర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

పంజాబీ భామ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక తెలుగుతో పాటు త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ‌..డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తా చాటేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. […]

బిగ్ బాస్‌5 లో పాయ‌ల్‌..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి యూత్‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, దిస్కో రాజా ఇలా ప‌లు చిత్రాల్లో న‌టించింది. అలాగే కొన్ని స్పెష‌ల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ .. సీజన్ 5 కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త గ‌త కొద్ది రోజులుగా నెట్టింట […]