సూపర్‌ స్టార్‌ ‘కింగ్‌’లాగున్నాడు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎలా ఉన్నాడనే అంశానికి సంబంధించి అభిమానుల్లో ఆందోళన ఉంది. ‘కబాలి’ సినిమా సందర్భంగా ఆయన అనారోగ్యానికి గురై, విదేశాల్లో చికిత్స పొంది వచ్చారు. అనంతరం ఆయన్ని అభిమానులు కలుస్తున్నారుగానీ, తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సూపర్‌స్టార్‌కి అత్యంత సన్నిహితుడైన టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు, తన మిత్రుడ్ని కలుసుకుని, అతనితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. రజనీకాంత్‌ కింగులాగున్నాడంటూ ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు అందించారు మోహన్‌బాబు. […]

మళ్ళీ ముంచేసిన జానారెడ్డి.

మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని మళ్ళీ మళ్ళీ ముంచేస్తూనే ఉన్నారు. ఏ వేదిక అయినాసరే ఆయనలోని టిఆర్‌ఎస్‌ అనుకూల భావాలు చాలా తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నాయి. అసెంబ్లీలో అయినా, పార్టీ వేదికలపైనా జానారెడ్డిది ఇదే తీరు. ప్రజలు, ఇంకా కెసియార్‌పై నమ్మకంతోనే ఉన్నారని, అందుకే కెసియార్‌ నిర్ణయాల్ని వ్యతిరేకించడంలేదని జానారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నేతలు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కాంగ్రెసు నాయకులంతా విమర్శిస్తోంటే, […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]

బాలయ్య ఓవర్శిస్ లో సంచలనం

గౌతమి పుత్ర శాతకర్ణి  ఈ సినిమా హీరో డైరెక్టర్ ల కంబినేషనే ఒక సంచలనం పౌరాణిక పాత్రలు పోషించడంలో బాలయ్య దిట్ట, సమాజాన్ని ప్రేరేపించగల సినిమాలు తీయడంలో పేరొందిన దర్శకుడు క్రిష్. ఈ కలయిక అనగానే సినీ ప్రేక్షకులలో ఎక్సపెక్టషన్స్ భారీస్థాయిలో వున్నాయి.  ఈ కలయికలో ఓ హిస్టోరికల్ మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాలయ్య 100వ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. గౌతమీపుత్ర శాతకర్ణి […]

మాజీ ప్రధాని మనవడితో తమన్నారొమాన్స్

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా జాగువార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెస్తున్నాడు డైరెక్టర్ మహాదేవ్. ఈ సినిమా ని కన్నడతో పాటే తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి మిల్కీ బ్యూటీ తమన్నా రెడీ అయ్యింది. ముందుగా ఈ సాంగ్ ని శృతిహాసన్ తో చేయాలనుకున్నారు చిత్ర […]

ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

సిక్స్‌ ప్యాక్‌తో చితక్కొట్టేశాడు

చాలా మంది హీరోలు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశారు. వారిలో యంగ్‌ హీరోలు సైతం ఉన్నారు. అయితే నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్‌ మాత్రం ఇంతవరకూ ఈ సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. కానీ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇజం’ సినిమా కోసం తొలిసారిగా కళ్యాణ్‌ రామ్‌ సిక్స్‌ పాక్‌ ట్రై చేశాడు. సెప్టెంబర్‌ 2 హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ పాక్‌లో ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ‘పటాస్‌’ సినిమాతో విజయం అందుకున్నాడు కళ్యాణ్‌రామ్‌. […]

హోమ్లీ బ్యూటీ స్విమ్మింగ్‌ టిప్స్‌

పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ముద్దుగుమ్మ స్నేహ. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. కానీ స్టార్‌డమ్‌ మాత్రం రాలేదు అమ్మడికి. ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కి స్నేహ పక్కాగా సెట్‌ అవుతుంది. ‘శ్రీరామదాసు’ సినిమాలో రామదాసు భార్యగా స్నేహ పాత్ర అమోఘం. ఇలా చాల ట్రెడిషనల్‌ పాత్రల్లో స్నేహ నటన అద్భుతంగా ఉంటుంది. అలాంటి స్నేహ పెళ్లి చేసుకుని సినిమాలకు తాత్కాలికంగా దూరం అయ్యింది. అయితే ఈ మధ్యే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. తన తోటి హీరోయిన్లు, తన కన్నా […]

యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]