ఏపీలో మల్టీప్టెక్స్ సినిమా హాళ్ల యాజమాన్యాలు, మూవీ డిస్ట్రి బ్యూటర్లకు మధ్య ఫైట్ జోరందుకుంది! మూవీలకు సంబంధించిన కెలక్షన్ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం మరింత పెరిగింది. విశాఖ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయితే, మూవీ విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు వాటాలు పంచుకుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 50% మేర కలెక్షన్లను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే, తమకు 60% […]
Author: admin
కొత్త ట్విస్ట్ జగన్‌తో కాంగ్రెస్ దోస్తీ
ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులున్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న చరిత్ర కూడా ఆ పార్టీ పేరునే లిఖించబడి ఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ ఉనికి సైతం ఏపీలో ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే… అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అప్పటిదాకా బలంగా ఉంటూ వచ్చిన ఓటు బ్యాంకు అంతా ఏమైంది..? ఈ ప్రశ్న ఎవరిలోనైనా తలెత్తితే వెంటనే వారి చూపులు […]
శాతకర్ణిలో ట్విస్ట్ ఇవ్వనున్న బాలయ్య..
ఓల్డ్ మూవీలు దేవదాసు, లైలా మజ్నూ, ఆరాధన వంటి వాటిలో మూవీ లాస్ట్‌కొచ్చేసరికి హీరో చచ్చిపోవడం, సెంటిమెంట్‌తో ఆడియన్స్ కళ్లలో కన్నీళ్లు కారడం వంటివి ఉండేవి. వాస్తవానికి అప్పట్లో ఆ సీన్లే.. మూవీలని సూపర్ హిట్ చేసేవి. కానీ, ట్రెండ్ మారింది! ఇప్పుడొస్తున్న మూవీల్లో హీరోలు చచ్చిపోయే సీన్లను ఆడియన్స్ యాక్సప్ట్ చేయడం లేదు. ఎంత సెంటిమెంట్‌నైనా తట్టుకుంటున్నారు తప్ప.. మూవీలో హీరో చచ్చిపోయే సీన్లు ఉంటే మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిని గమనించిన మన డైరెక్టర్లు, […]
జనసేనది ఒంటరి పోరే..
ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ ప్రతక్ష్య రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారికి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు… బీజేపీపై కాస్త గట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్తగా విమర్శలు చేస్తోన్న పవన్ వైఖరిని చూశాక మరి జనసేన వచ్చే ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతుందా..? లేక ఇప్పటిదాకా మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు […]
ఎన్టీఆర్ పాలిట విలన్‌గా మారిన మాజీ సీఎం
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అటు టాలీవుడ్ సినీ జనాలు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ జాబితాలోనే ఓ దర్శకుడి పేరు కూడా వినిపించింది. సినిమా ఫలితం మాట ఎలా […]
టీఆర్ఎస్‌లో కొత్త కలరింగ్ చూస్తే షాకే
అవును! తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కి కొత్త కలరింగ్ ఇవ్వబోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఆయన అనేక సంచనల నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంపై తన ముద్ర పడేలా జిల్లాల ఏర్పాటు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, పార్టీ కేడర్ సహా మంత్రులు, నేతలు అందరూ నిత్యం ప్రజల్లో ఉండేలా పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. వాస్తవానికి నిత్యం […]
టీడీపీ కంచుకోటపై జనసేన గురి
జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. పవన్ కేవలం ఓటు హక్కు మాత్రమే ఏలూరులో నమోదు చేయించుకున్నట్టు పైకి కనిపించినా దీని వెనక అనేక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. పవన్ ఏలూరు నివాసం ఉండేందుకు తనకు అనువైన భవనం చూడాలని కూడా కార్యకర్తలకు చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఈ వ్యూహం వెనక టీడీపీ కంచుకోటను టార్గెట్ చేసినట్టు […]
పాదయాత్రకు రెడీ అవుతోన్న జగన్…
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, నేతల పాదయాత్రలకు అవినాభావ సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1600 కిలోమీటర్ల దూరం చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ను తేవడమే కాదు… ఆనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నేతలందరినీ వైఎస్ ముందు మరుగుజ్జులుగా మార్చేసి ఆయనను ఏకంగా సీఎం పీఠం ఎక్కించేసింది. ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆరుపదులు దాటిన వయసులో […]
కమల్‌కు గౌతమి గుడ్‌బై
నటుడిగా కమల్‌హాసన్ స్థాయి ఎలాంటిదో ప్రత్యేకంగా ఇప్పడు చెప్పుకోనవసరం లేదు. తన అసమాన నటనతో విశ్వనటుడిగా పేరొందిన కమల్‌హాసన్ దేశవ్యాప్తంగానే కాదు. విదేశాల్లోనూ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సినిమారంగంలో పరిపూర్ణ నటుడిగా పేరొందిన కమల్ వైవాహిక జీవితం మాత్రం ఒడిదుడుకులమయంగానే సాగుతూ రావడం అందరికీ తెలిసిందే. కమల్ నటనను ఎంతగానో ప్రేమించే అభిమాన తీవ్రవాదులు కూడా ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం అతడిని ఎంతమాత్రం ఆదర్శంగా తీసుకోవాలనుకోరు. ఇంతకీ విషయేమిటంటే నటుడు కమల్‌హాసన్‌తో సుమారు […]