గుర్తింపు కోరుకోని రాజకీయ నాయకులెవరుంటారు చెప్పండి! అసలే పార్టీల మధ్య, నాయకుల మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న తరుణంలో.. ప్రజలకు ఉపయోగపడే ఏ చిన్న పని చేసినా ఆ క్రెడిట్ కొట్టేయడానికి నాయకులు తహతహలాడుతుంటారు. అయితే కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఆ క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారా? అని సందేహాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. లింగంపేట- మోర్తాడు మధ్య రైలు ప్రారంభించిన క్రెడిట్ అటు బీజేపీకి దక్కకుండా చేసేందుకు ఎంపీ అనుచరులు ప్రయత్నిస్తున్నారట. […]
Author: admin
రవితేజను ఆ డైరెక్టర్ ఆదుకుంటాడా..!
మాస్ మహరాజ్ రవితేజ కేరీర్ ఇప్పుడు గందరగోళంగా ఉంది. 2015లో కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత ఇప్పటి వరకు మళ్లీ తెరమీద కనపడేదు. 2016లో రవితేజ సినిమా డైరీ ఖాళీగా ఉంది. 2017లో అయినా రవితేజ సినిమా వస్తుందా ? లేదా ? అన్నది ఇంకా గ్యారెంటీ లేదు. రవితేజ మూడు నాలుగు ప్రాజెక్టుల సిట్టింగ్‌లో కూర్చున్నా ఏవీ ఇంకా ఓకే అవ్వలేదు. రవితేజ మార్కెట్ చాలా డౌన్ అయిపోవడంతో మనోడి మీద భారీ […]
జనసేనలోకి మాజీ సీఎం కిరణ్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం, తాను హైదరాబాదీనే అయినా.. సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నానంటూ సీఎం సీటులో కూర్చునే పెద్ద ఎత్తున పెను సంచలనం సృష్టించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? రాష్ట్రం విడిపోతే నీళ్లకోసం పెద్ద ఎత్తున యుద్ధాలు చేసుకోవాల్సి వస్తుందంటూ.. తన సమైక్య వాదనకు బలం చేకూర్చే కామెంట్లు చేసిన క్రికెట్ లవర్ కిరణ్ రెడ్డి గుర్తున్నారా? దాదాపు అందరూ మరిచిపోయిన ఈ కాంగ్రెస్ మాజీ నేత, సొంత కుంపటి పెట్టుకుని విఫలమైన పార్టీ […]
మోడీకి ఇది అసలు సిసలైన పరీక్ష
ప్రధాని మోడీకి పరీక్షా కాలం మొదలైందా? ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగడంతో ఇది మొదలవబోతోందా?అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! ప్రాంతీయ పార్టీల హవాను తగ్గించి.. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోడీ-అమిత్ షా బృందం విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే! కానీ అవన్నీ విఫలమైపోయాయి! ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జెండా […]
పవన్‌ను బుజ్జగించే పనిలో వదినమ్మ
మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ మధ్య ఉన్న విబేధాలు చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సాక్షిగా మరోసారి బహిర్గతం అయ్యేలా ఉన్నాయి. చిరు 150వ సినిమా కావడంతో ఈ సినిమా ఆడియో ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు మెగా హీరోలందరూ వస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ ఎనౌన్స్ అయినప్పటి నుంచి పవన్ సైతం వస్తాడని అందరూ అనుకున్నారు. తాజాగా అల్లు అరవింద్ పవన్ ఈ ఫంక్షన్‌కు రావడం లేదని బాంబు పేల్చారు. పవన్ బిజీ […]
లోకేష్‌కు మంత్రి పదవి బాబు అందుకే ఇవ్వట్లేదా
ఏపీ అధికార పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబులపై వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా మాటలతో విరుచుకుపడింది. గతానికి భిన్నంగా ఇద్దరు నేతలను క లిపి కుమ్మేసింది. చౌకబారు విమర్శలు పక్కనపెట్టి.. నిఖార్సైన వ్యాఖ్యలతో చించొదిలి పెట్టింది. ఇంతకీ రోజా ఏమందనేగా సందేహం.. అక్కడికే వచ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా తన మాటలకు మరింత మషాళా అద్ది.. సంచలనం సృష్టించింది. చంద్రబాబుకు లోకేష్ […]
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రెడ్డి ఎమ్మెల్సీ
తన వ్యూహాలతో, రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేసే తెలివైన నాయకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో బయటపడింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో మరోసారి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో సామాజికవర్గాల పరంగా అధికంగా ఉన్నది రెడ్లే!! అందుకే ఈసారి వారిని తన వైపు తిప్పుకునేందుకు మరో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. పార్టీ అధ్యక్షుడిగా తన స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది. […]
స్విస్ ఛాలెంజ్‌లో మరో ట్విస్ట్
ఏపీ రాజధానిలో కీలకమైన కోర్ ఏరియా డెవలప్‌మెంట్ విషయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రాజధానిలోని ప్రధాన నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే, ఈ విషయంలో పలు సందేహాలు రావడం.. విషయం కోర్టుల వరకు వెళ్లడంతో దీనిపై వెనక్కి తగ్గారు. మరో మార్గంలో రాజధాని నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని కోర్టు కు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టెండర్లకు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పుడైనా కొత్త విధానాన్ని రూపొందించారా? అంటే అది సందేహం […]
ఏపీలో తెలుగు భాష పీక నొక్కుతున్న మంత్రి
దేశ భాషలందు తెలుగు లెస్స! అన్న కృష్ణదేవరాయులు.. తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి అనాదిగా ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రమనే పేరును చంద్రబాబు ప్రభుత్వం తుడిచి పెట్టేయాలని చూస్తోందనే విమర్శలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా కనుమరుగవుతున్న భాషల్లో ఒకటిగా ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్న విషయం తెలిసింది. అలాంటి సమయంలో మరింతగా తెలుగును పోషించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. […]