ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్ళ పాటు ఓ ఆశయం కోసం నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే ఆమెకి ప్రత్యక్ష ఎన్నికల్లో పడ్డ ఓట్లు 90 .అదే ఓ ప్రజా ప్రతినిధి, మంత్రి అయిన వ్యక్తి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే 50 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.ఇదీ మన ప్రజాస్వామయం.ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వాంగా చెప్పుకునే మనదేశం లో రాజకీయనాయకులే కాదు […]
Author: admin
సినిమా షూటింగ్ నిలిపివేయాలంటూ రచ్చ రచ్చ చేసారు
ఏ ముహూర్తాన సంజయ్ లీల భన్సాలీ పద్మావతి సినిమా మొదలు పెట్టాడో కానీ అడుగడుగునా సినిమాకి ఇబ్బందులు తలెత్తుతూనే వున్నాయి.ఇబ్బందులంటే అదేదో షూటింగ్ ని అడ్డుకోవడం లాంటివి అయితే పర్లేదు.ఈ సినిమాకష్ఠాలు నిజంగా సినిమా కష్టాలే.ఏకంగా దాడులే జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆ మధ్యన పద్మావతి షూటింగ్ జైపూర్ లో జరుగుతుండగా కొంత మంది దుండగులు చిత్ర దర్శకుడు బన్సాలి పై భౌతిక దాడికి తెగబడ్డారు.ఈ ఘటనతో బాలీవుడ్ అంత ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అన్ని వర్గాల […]
గవర్నర్‌కు కేసీఆర్ కాస్ట్‌లీ గిఫ్ట్..!
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య.. అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ను సరైన మార్గంలో గైడ్ చేస్తూ మార్గదర్శిలా ఉన్నారు నరసింహన్!! అంతేగాక ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్నా.. కేవలం తెలంగాణకు మాత్రమే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారనే అపవాదునూ మూటగట్టుకున్నారు. అయితే తనకు ఎంతగానో అండగా నిలిచిన నరసింహన్‌కు ఇప్పుడు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. గవర్నర్ పదవీకాలం […]
కర్నూలులో టీడీపీకి ఊహించని షాక్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అలాగే ప్రతిపక్ష వైసీపీలోకి చేరబోయే నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చించారని సమాచారం. ఆయనకు ఎంపీ టికెట్ […]
బంగారు తెలంగాణ.. కాదు అప్పుల తెలంగాణ
అప్పు చేసి పప్పు కూడు మాత్రం తినొద్దంటారు పెద్దలు!! కానీ తెలంగాణ పెద్దలు మాత్రం `మాకు అప్పే ముద్దు` అంటున్నారు. విభజన తర్వాత తీవ్ర ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా నవ్యాంధ్ర ఆవిర్భవిస్తే.. మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. మూడేళ్లు గిర్రున గడిచాయి! ఇప్పుడు తెలంగాణ కూడా మిగులు నుంచి అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది, ఎంతలా అంటే.. అప్పుల్లో ఏపీని కూడా మించిపోయేంతగా!! ప్రస్తుతం తెలంగాణ అప్పులు ఎంతో తెలుసా 77వేల కోట్లు!! ఇప్పుడే పరిస్థితి ఇలా […]
విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా
నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]
అమ్మ వారసుడు ఉన్నాడా ..? ఆస్తులు నాకే సొంతం
మొన్నటికి మొన్న `మెగాస్టార్ చిరంజీవి కొడుకును నేను` అని ఒక వ్యక్తి సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు!! ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం జయలలిత విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. తమిళనాడు రాజకీయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కానీ ఉరుము లేని పిడుగులా వస్తున్న `నేను అమ్మ కూతురిని` అని మొన్ననే ఒక యువతి హల్‌చల్ చేసింది. ఇప్పుడు `నేను అమ్మ కొడుకుని` అంటూ మరో వ్యక్తి తెరపైకి వచ్చాడు! ఇన్నాళ్లూ ఎందుకు […]
పయ్యావుల కేబినెట్ ఎంట్రీకి అడ్డు పుల్లెవరు..!
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వార్తలు గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకాక్షళనలో ఆశావాహుల లెక్కలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియర్లు, జంపింగ్ జపాంగ్‌లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవరికి వారు తమకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఆశల్లో మునిగి తేలుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఫస్ట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే […]
రానాతో కలిసి సందడి చేయబోతున్న నాని
టాలీవుడ్ లో నాచ్యురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టి డబల్ హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో టాలీవుడ్ లో వారసత్వ హీరోలకి సవాల్ విసిరాడు. సినిమా కథల సెలక్షన్ విషయంలో సైతం కుర్ర హీరోలందరూ ఇప్పుడు నాని ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సినిమా సినిమాకి తనలోని నటుడ్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నాడు. ఆ కోవలోనే రకరకాల ప్రయోగాలుకూడా చేస్తున్నాడు. మొన్నామధ్య వచ్చిన ఒకే బంగారం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ […]