Author: admin
తమిళనాట షాక్: దీప ఓ పార్టీ, దీప భర్త మరో పార్టీ
తమిళనాట మరో సంచలనం! దివంగత మాజీ సీఎం జయలలిత సమాధి.. ఎన్నో ఆసక్తికర అంశాలకు వేదికగా నిలుస్తోంది. ఊహించని పరిణామాలతో రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్! అమ్మ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీపకు అనుకోని వ్యక్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది. దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయగా.. ఇప్పుడు ఆమె భర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి కలకలం […]
అంబాసిడర్ విషయాన్నే మరిచిన సానియా
సెలబ్రిటీలను అంబాసిడర్‌లుగా నియమిస్తే.. ఆ సంస్థకు సంబంధించిన ఏకార్యక్రమంలోనైనా పాల్గొంటారు. మరి అలాంటిది ఏకంగా ఒక రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ అంటే.. ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఆ బాధ్యత మరిచింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా!! హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించిన ఆమెను.. రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడర్ చేసి కోట్లు కుమ్మరించారు ముఖ్యమంత్రి కేసీఆర్! అయితే అడపాదడపా ఫ్యాషన్ షోల్లో తళుక్కుమని మెరవడం మినహా ఆమె వల్ల ఒనగూరిన ప్రయోజనం మరొకటి లేదు. […]
రుణ`మాఫీ`తో ఇద్దరు చంద్రులకు చెక్
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
శశికళను పక్కన పెట్టిన అన్నాడీఎంకే
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు కాలం కలిసి రావట్లేదు! తన వర్గం వారే ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం లేదు! తన తరఫున సీఎం పదవిలో కూర్చోపెట్టిన పళని స్వామి ఇప్పుడు చిన్నమ్మ వంకే చూడటం లేదట. అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారట. దీంతో నమ్మిన వారే ఇలా చేయడంతో శశికళ తీవ్రంగా ఆగ్రహానికి గురవుతున్నారట. ఇప్పుడు దీనికి తోడు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆమె ఉంటారో లేదో రెండు రోజుల్లో స్పష్టత […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో
బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా […]
పవన్ బాధితుల బాధలు చూడండి
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తప్పు చేసిన వారిని నిలదీసేందుకు…వారిని ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని పదే పదే చెపుతుంటాడు. ఈ క్రమంలోనే పవన్ ఏపీలో ఇప్పటికే పలు సమస్యలతో బాధపడుతోన్న బాధితుల పక్షాన పోరాడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ? అక్కడకు వెళ్లి వారి పక్షాన తాను పోరాటం చేస్తానని..ప్రభుత్వాన్ని నిలదీస్తానని…వారికి అండగా ఉంటానని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది..ఇప్పుడు పవన్ సినిమా వల్ల తమకు అన్యాయం జరిగిందని..ఈ […]