సీఎం చంద్రబాబు 2014లో అధికారంలోకి రావడానికి ఆయన సీనియరిటీనేగాక, ఉద్యోగులు కూడా కొంత కారణం! 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గతంలోలా ఉద్యోగులతో కఠినంగా వ్యవహరించను` అని చంద్రబాబు పదేపదే చెబుతూ వారిలో నమ్మకం కలిగేలా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిపక్ష నేత జగన్.. ఇప్పటినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. […]
Author: admin
ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ & మోక్షజ్ఞ రోల్ లీక్
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాఫిక్ ఎన్టీఆర్ బయోపిక్. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని, ఎన్టీఆర్ రోల్‌లో ఆయన తనయుడు బాలయ్య నటిస్తాడన్న వార్తలు సినిమా, రాజకీయ పరంగా కూడా సంచలనమయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సినిమాపై మామూలు అంచనాలు ఉండవు. ఎన్టీఆర్ కేవలం తెలుగు ప్రజలకే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ఆరాధ్యదైవం. ఈ బయోపిక్‌ను ఏ మాత్రం చెడగొట్టినా ఆ చెడ్డ పేరు బాలయ్యకు […]
ఆ మంత్రులకు చంద్రబాబు వార్నింగ్ వెనక..!
టీడీపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారు పేరు. టీడీపీ వాళ్లంతా ఒకే కుటుంబంలోని అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉండేవారు. అయితే అదంతా గతం ఇప్పుడు సీన్ మారిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో ఎవరికి వారే ఇష్టమొచ్చినట్టు స్వరం పెంచేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వార్నింగ్‌లు కూడా పని చేయడం లేదు. చాలా మంది అయితే చంద్రబాబునే లైట్ తీస్కొంటున్నట్టు కనపడుతోంది. ఎవరో ఒక నాయకుడు నోరు జారడం, అది మీడియాలో హైలెట్ […]
డీజే సినిమా వసూళ్లపై నాని పంచ్..!
నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. నాని అంటేనే కాంట్రవర్సీలకు దూరం. నాని ఏం మాట్లాడినా అది ఎవ్వరిని నొప్పించలేదు. అయితే ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొందరికి సూటిగానే తగిలాయా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాని తాజా చిత్రం నిన్ను కోరి. నివేద థామస్ నానికి జంటగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నానికి మీడియా ప్రతినిధుల […]
టీఆర్ఎస్‌లో బాబూ మోహన్ పనైపోయిందా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లో బాబూ మోహన్ పనైపోయిందా ? సీఎం కేసీఆర్‌ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహన్‌కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం మెదక్ జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాబూ మోహన్ మెదక్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నికతో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహన్ రెండుసార్లు దామోదర రాజనర్సింహను ఓడించాడు. […]
పవన్ మానియా ఎలా ఉందో మరోసారి స్పష్టమైంది
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్టామినా ఏంటో ఆయన తాజా సినిమా మరోసారి స్పష్టం చేస్తోంది. పవన్‌కు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తోంది. పవన్‌కు అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావరేజ్. సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బతో బయ్యర్లు భారీ నష్టాలు చూశారు. అయినా పవన్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండడం ట్రేడ్ వర్గాలకు సైతం దిమ్మతిరిగే […]
2019 వార్: ఏపీ, తెలంగాణలో ఎవరు ఎవరికి ఫ్రెండో..!
2019 సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉంది. ఎన్నికలకు ఆరు నెలల టైం పక్కన పెట్టేస్తే 15 నెలలు మాత్రమే ఉంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జట్టు కడతారు ? అధికార పార్టీలను ఢీకొట్టేందుకు కొత్త పొత్తుల లెక్క ఏంటన్నదానిపై ఊహాగానాలు, చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. రెండు చోట్లా కామన్ పాయింట్ ఏంటంటే అధికార పార్టీలను ఓడించేందుకు విపక్షాలన్ని ఒకే కూటమిగా ఏర్పడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే […]
కవిత ఎంపీ సీటుపై ట్రావెల్స్ అధినేత కన్ను
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వాత ఆమె ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మంత్రి అవ్వాలన్న కోరిక కవితకు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరితే వచ్చే ఎన్నికల తర్వాత ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న […]
నల్గొండ జిల్లాలో ఆ రెండు సీట్లలో టీఆర్ఎస్‌కు ఓటమేనా..!
తెలంగాణలోని పాత నల్గొండ జిల్లా పేరు చెపితే కాంగ్రెస్‌కు కంచుకోట. చంద్రబాబు సీఎంగా గెలిచినప్పుడు కూడా ఈ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఇక ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధిస్తున్నా కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ఎమ్మెల్సీ సీటు గెలుచుకుని ఎన్నో సంచలనాలకు కారణమైంది. ప్రస్తుతం ఈ జిల్లాలోనే టీ కాంగ్రెస్‌కు ఉద్దండులైన నాయకులు అందరూ ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునా సాగర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, […]