విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని […]
Author: admin
నిరుద్యోగులకు షర్మిల బంపరాఫర్…
డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కూతురు తెలంగాణలో పార్టీ (వైటీపీ) ప్రారంభించిన తరువాత కాస్త చురుగ్గానే ముందుకు వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ కూతురిగా తెలంగాణలో రాజకీయ భవితవ్యం తేల్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన నిరుద్యోగ సమస్యను భుజానెత్తుకున్నారు. నిరుద్యోగులకు బాసటగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలకు సంఘీభావంగా ప్రతి మంగళవారం వారింటి వద్ద దీక్ష చేపడుతున్నారు. ఇపుడు మరో అడుగు […]
జగన్ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..
రాష్ట్రంలోని రోడ్లకు వర్షాకాలం అనంతరం వెంటనే మరమ్మతు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట. అదేంటి.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వీరికెందుకు అంత హ్యాపీ.. అందులోనూ ఏపీలో ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన పార్టీలో ఉంటారు కదా అనుకునేరు. అసలు విషయమేమిటంటే.. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన కార్యకర్తలు, […]
రేపు టీఆర్ఎస్ జంటనగరాల సర్వసభ్య సమావేశం..
తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 44 సీట్లను కోల్పోయింది. బీజేపీ 48 చోట్ల గెలిచి బలం పుంజుకుంది. దీంతో తిరిగి పార్టీకి జవసత్వాలు అందించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం జంటనగరాల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీనియర్లు. పీవీ నర్సింహరావు మార్గ్ లోని జలవిహార్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో […]
మనోజ్ కు దొరికింది.. మెగాస్టార్ కు దొరకలేదా..
ఏపీలో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే మేము థియేటర్లు నడపలేమని యజమానులు చెబుతున్నారు. ఈ సమస్యను సరిదిద్దేందుకు టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, ఇతర సీనియర్ నటులు ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం కార్యాలయం మాత్రం నేడు..రేపు అంటూ వాయిదా వేస్తోంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ జగన్ ను కలవడం టాలీవుడ్ […]
’బండి‘ ప్రయాణం.. 100 కిలోమీటర్లు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర వంద కిలోమీటర్లు దాటింది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని హుజూరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా గతనెల 28న బండి సంజయ్ హైదరాబాదులో తన పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమైన యాత్ర ఇపుడు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట వరకు వచ్చింది. అక్కడికి 100 కిలోమీటర్ల నడక పూర్తవడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. దూకుడు పెంచిన […]
షర్మిలకు నిరాశ మిగిల్చిన విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం..
అన్నను కాదని.. తెలంగాణలో పార్టీ ప్రారంభించి.. జనంలోకి వెళుతున్న షర్మిల పార్టీ వైటీపీకి అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ప్రశాంత్ కిశోర్ సలహాలిస్తున్నా ఎందుకో షర్మిల రాజకీయంగా వెనుకబడే ఉన్నారని చెప్పవచ్చు. అందుకే కాస్త పొలిటికల్ మైలేజ్ తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ వర్ధంతిని ఉపయోగించుకుందామని ఎవరో సలహా ఇచ్చినట్లున్నారు. అనునకున్నదే ఆలస్యం.. హైదరాబాదులో వైఎస్ఆర్ ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు వైసీపీ అధ్యక్షురాలు విజయమ్మ. కార్యక్రమమైతే జరిగింది.. నాయకులు, మేధావులు మాట్లాడారు.. అయితే అనుకున్న ప్రచారం రాలేదు.. పెద్దగా ప్రయోజనమూ […]
వచ్చేనెల వస్తుందా? రాదా? జగన్ అన్న…
జూన్ నెలలో 61.46 లక్షల మంది, జులైలో 60.95 లక్షలు, ఆగస్టులో 60.50 లక్షలు, సెప్టెంబరులో 59.18 లక్షలు.. ఇదీ ఈ సంవత్సరం లెక్క.. ఈ గణాంకాలను గమనిస్తే ప్రతినెలా తగ్గుతున్నాయి అని ఎవరైనా చెప్పగలరు. ఏమిటివి అంటే.. ఏపీ ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తున్న పెన్షన్ల సంఖ్య. నెలనెలా పెన్షన్లలో కోత విధిస్తుంటే లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చేనెల ఖర్చులకు గ్యారేంటీగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు […]
అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…
వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.. ఇక కుటుంబపరంగా చూస్తే ఇద్దరికీ సారూప్యత ఉంది. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. వైఎస్ఆర్ కు జగన్, షర్మిల సంతానమైతే.. కేసీఆర్ కు కేటీఆర్, కవిత. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇపుడు పిల్లల విషయానికి వస్తే ఏపీలో […]









