బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?

September 7, 2021 at 5:28 pm

విలాసవంతమైన జెట్ విమానం.. అందులో రాజసం ఒలకబోస్తూ కూర్చున్న బాలినేని.. ప్లేట్ లో అందంగా కనిపించే ఆహారపదార్థాలు.. ఇవీ ఆ ఫొటోలో మనకు కనిపించే దృశ్యాలు .. ఏపీ రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు వైరల్ అయింది. మంత్రి రష్యా పర్యటనలో ఉండగా జెట్ విమానంలో తీసుకున్న ఫోటోను పోస్టు చేశారు. ఇపుడు అదే ఈయనకు సమస్య అయి కూర్చుంది.బాలినేని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇవ్వడంతో సర్కారు షాక్ అయింది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతోంది.

బాలినేని రష్యాకు ఎందుకు వెళ్లారు? అధికారిక పర్యటనా? లేక వ్యక్తిగతమా? జెట్ విమానానికి ఖర్చు ఎవరు పెట్టారు? ఆయనే సొంత ఖర్చులతో విలాసాలు అనుభవించారా? అనేవి ఇపుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలు. మంత్రులు అధికార పర్యటనలకు విదేశాలకు వెళితే ఆ వివరాలు వెబ్ సైట్ లోకానీ, ఖర్చుల వివరాలు జీఓల రూపంలో కానీ వెల్లడించాలి. అయితే జీఓలు సర్కారు అప్ డేట్ చేయడం లేదు. అందుకే సవాలక్ష ప్రశ్నలకు సర్కారు సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. బాలినేని ఫొటోపై టీడీపీ వేగంగా స్పందించింది. అదే ఫొటోను ట్వీట్ చేస్తూ.. హవాలా కింగ్ బాలినేని అని హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసి వైరల్ చేసింది. పర్యటనకు వెళితే ప్రశాంతంగా వెళ్లాలి కానీ ఇలా చేస్తారా బాలినేనీ అని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై సీఎం ఎలా రెస్పాండ్ అవుతారో.

బాలినేని ట్రిప్.. ఖర్చు ప్రభుత్వానిదా.. ప్రజలదా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts