టాక్ అలా, క‌లెక్ష‌న్స్ ఇలా.. `18 పేజెస్‌` 2 డేస్ టోట‌ల్ వ‌సూళ్లు ఎంతంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ క‌థ అందించ‌గా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 23న అట్ట‌హాసంగా విడుద‌లై.. పాజిటివ్ టాక్‌ను అందుకుంది. […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకు క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌.. తేడా వ‌స్తే ఇక అంతే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసింది. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. తమన్ స్వరాలు […]

2వ రోజు `ధ‌మాకా` ఊచ‌కోత‌.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన‌ తాజా చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా ఊచ‌కోత కోస్తోంది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `18 పేజెస్‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `18 పేజెస్‌`. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాత‌గానే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గోపీ సుందర్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్,రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా […]

చలపతిరావు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎలా దూర‌మైందో తెలుసా?

ప్ర‌ముఖ సీనియర్ న‌టుడు చలపతిరావు(78) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. 1966లో `గూఢచారి 116` సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చ‌ల‌ప‌తిరావు.. విలన్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుని వెండితెరపై ఒక వెలుగువెలిగారు. చ‌ల‌ప‌తిరావు వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న […]

డిఫ‌రెంట్ డ్రెస్ లో శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. మ‌తిపోగొట్టేసిందిగా!

యంగ్‌ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే తనదైన అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన రెండో చిత్రం ధమాకా. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, […]

విజ‌య్ `వార‌సుడు` రన్‌ టైమ్‌ మరీ అంత ఎక్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వారిసు(వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా […]

అత‌డిపైనే ఆశ‌లు పెట్టుకున్న పూజా హెగ్డే..ఈసారి మిస్ అయితే కెరీర్ ఖ‌తం!?

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్ చిత్రాలు భారీ అంచ‌నాల నడుమ వచ్చి ప్రేక్ష‌కుల‌ను ఘోరంగా నిరాశపరిచాయి. తాజాగా ఈ అమ్మడు `సర్కస్` అనే మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ర‌ణ్వీర్ సింగ్‌ హీరోగా నటించాడు. […]

మా బావ మనోభావాలు.. `వీర సింహా రెడ్డి` ఐటెం సాంగ్ అదిరిందెహే!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులూ సినిమాపై హైప్ క్రియేట్‌ చేస్తున్నారు. […]