చలపతిరావు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎలా దూర‌మైందో తెలుసా?

ప్ర‌ముఖ సీనియర్ న‌టుడు చలపతిరావు(78) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. 1966లో `గూఢచారి 116` సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చ‌ల‌ప‌తిరావు.. విలన్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు.

ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుని వెండితెరపై ఒక వెలుగువెలిగారు. చ‌ల‌ప‌తిరావు వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న బందరులో పీయూసీ చదువుతున్న సమయంలో ఇందుమతి అనే అమ్మాయితో చ‌ల‌ప‌తిరావు ప్రేమలో పడ్డారట. ఇందుమతినే మొద‌ట ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డం.. వెంట‌నే చ‌ల‌ప‌తిరావు ఒప్పుకోవ‌డం, వారం రోజులకే బెజవాడలో స్నేహితులు వీరి పెళ్లి చేయ‌డం జ‌రిగిపోయాయ‌ట‌.

ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అవ్వ‌గా, కుమారుడు ర‌విబాబు ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా టాలీవుడ్‌లో కొన‌సాగుతున్నారు. అయితే ముగ్గురు పిల్ల‌లు పుట్టిన కొద్ది రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చలపతిరావుకు దూర‌మైంది. ఇందుమతి అగ్ని ప్రమాదంలో చనిపోయారు. వీళ్లు చెన్నైలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ ఈ ఘటన చోటు చేసుకుంది. కిచెన్ లో ఇందుమతి మంటల్లో చిక్కుకుని.. కేకలు వేయడంతో చలిపతిరావు వెళ్లి మంటలు ఆర్పారు. ఆసుపత్రిలో మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆమె మరణించింది. భార్య చిన్న‌వ‌య‌సులోనే చ‌నిపోయినా పిల్లల భవిష్యత్ కోసం చ‌ల‌ప‌తిరావు రెండో పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే ఉండిపోయారు.