అప్పలరాజుకు సొంత తిప్పలు..ఓడిస్తామని వార్నింగ్..!

మంత్రి సీదిరి అప్పలరాజుకు సొంత పార్టీలోనే అసమ్మతి పోరు పెరిగింది..ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన వారిని..మంత్రి అయ్యాక పట్టించుకోవడం మానేశారు. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని చెప్పి..పలాస నియోజకవర్గంలోని వైసీపీ అసమ్మతి వర్గం భగ్గుమంటుంది. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అప్పలరాజు గెలిచారు. అలాగే అదృష్టం కొద్ది మంత్రి పదవి కూడా వరించింది. ఇక పదవి వచ్చాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..చంద్రబాబుపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. […]

రాప్తాడు రగడ..పరిటాల ఫ్యామిలీ తగ్గలేదు..!

గత కొన్ని రోజులుగా రాప్తాడు రాజకీయం బాగా హీటెక్కిన విషయం తెలిసిందే..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జాకీ సంస్థ..వైసీపీ నేతల బెదిరింపులతో..ఇప్పుడు తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని గురించి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసింది. అటు పత్రికల్లో కూడా వైసీపీ నేతల బెదిరింపుల వల్ల జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి..చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్..జగన్‌కు చెక్ ఎలా?

మరోసారి వైసీపీ సర్కార్‌పై పవన్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటం బాధితులకు..మంగళగిరిలోని జనసేన ఆఫీసులో సాయం అందించారు. ఇళ్ళు కూల్చివేతల్లో బాధితులుగా ఉన్నవారికి లక్ష చొప్పున సాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఫైర్ అయ్యారు. రాజకీయంగా మీరే చేయాలా? మేము ఏంటో చూపిస్తామని, ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దలుగొడతామని అన్నారు. తమది రౌడీ సేన కాదని, విప్లవ సేన అని..ఇప్పటంలో గడపలు […]

విజయవాడ సెంట్రల్‌ వైసీపీలో పోరు..మల్లాదికి రివర్స్.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలకు, ఇతర నేతలకు పడటం లేదు. ఇలా నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోతుంది. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు పోరు జరుగుతుంది. ప్రొద్దుటూరు, గురజాల లాంటి స్థానాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వార్ నడుస్తోంది. ఇదే పోరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్యీ […]

కొవ్వూరులో ఇదేం రచ్చ..తమ్ముళ్ళు తగ్గట్లేదు..!

కంచుకోట లాంటి నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేతులారా నాశనం చేస్తున్నారు..గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు పలు టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. సరే అప్పుడు జగన్ వల్ల దెబ్బతింటే..ఇప్పటికీ కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరగడం లేదు. దానికి కారణం స్వయంగా తెలుగు తమ్ముళ్లే అని చెప్పొచ్చు. ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు వల్ల పలు కంచుకోటల్లో టీడీపీ బలపడటం లేదు. అలా బలపడని కంచుకోటల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు కూడా ఒకటి..ఇది పక్కా టీడీపీ […]

గంటా-ముద్రగడలతో జగన్ ‘కాపు’ రాజకీయం..!

రాష్ట్రంలో కొన్ని వర్గాలు అధికార వైసీపీకి దూరమవుతున్నాయనే చెప్పాలి..గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఉండటంతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక..అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా జగన్ పాలన సాగుతుందా? అంటే ఆ విషయం ఆయా వర్గాల ప్రజలకే బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యే పరిస్తితి. ఇందులో మొదటగా కమ్మ వర్గం బాగా దూరమైంది..ఎందుకు దూరమవుతుందో […]

 ఆత్మకూరుపై ఫోకస్..మేకపాటి ఫ్యామిలీకి చెక్..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద బలం కూడా లేదు. మొదట నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. కేవలం 1983, 1994 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది..ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచారు..అలాగే మంత్రిగా పనిచేశారు. కానీ మధ్య గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో గౌతమ్ సోదరుడు […]

‘బీసీ’ మంత్రం..ఈ సారి నమ్మేది ఎవరిని?

ఏపీలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాల ఓట్లని మళ్ళీ కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీసీలు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీసీ వర్గాలు మొదట నుంచి ఎక్కువగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ  గత ఎన్నికల్లో బీసీ వర్గం వైసీపీ వైపుకు వెళ్లింది..టీడీపీ కాపు రిజర్వేషన్లు వైపు మొగ్గు చూపడం, బీసీలకు అనుకున్న మేర అండగా లేకపోవడం, మరో వైపు జగన్ కాపు రిజర్వేషన్లు తన వల్ల […]

అటు పెడన..ఇటు మైలవరం..జోగి చిచ్చు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల్లో మంత్రి జోగి రమేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే..జగన్‌కు వీర విధేయుడుగా ఉన్న జోగికి రెండోసారి మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కిన విషయం తెలిసిందే. మంత్రి పదవి దక్కాక..తన శాఖకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు గాని..ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్‌లపై ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అలా మంత్రిగా ముందుకెళుతున్నారు. ఇక మంత్రిగా ఉంటూ తాను ప్రతినిధ్యం వహిస్తున్న పెడనలో […]