రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేరు గాని..ఆయన చుట్టూ మాత్రం రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. గత ఎన్నికల నుంచి మరీ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. టీడీపీ ఓడిపోవడంతో, ఇంకా పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అలాగే చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో కొందరు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్లోగన్స్‌తో హల్చల్ చేస్తారు. అటు వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఎన్టీఆర్ పేరు ఎక్కువ ప్రస్తావిస్తారు. చంద్రబాబు , ఎన్టీఆర్‌ని […]
Author: Krishna
బాబు వెస్ట్ టూర్..వైసీపీ ఫెయిల్ చేస్తుందా?
మరో సరికొత్త కార్యక్రమంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మొన్నటివరకు బాదుడేబాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లో తిరిగిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే పేరుతో ముందుకెళ్లనున్నారు. ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులని..టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళి వివరించనున్నారు. 50 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలోని కలపర్రు టోల్‌గేట్ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు ఈ […]
కృష్ణాలో కొత్త ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్.!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సీటు గురించి టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సీటు ఇస్తానని చెప్పారు. ఇక దాని బట్టి చూస్తే అంత గొప్ప పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలు కృష్ణాలో కనిపించడం లేదు. కాకపోతే సీటు విషయంలో సీనియర్లకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది గాని..జూనియర్లకు ఆ అడ్వాంటేజ్ కనిపించడం లేదు. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి సీటు దక్కే విషయంలో రిస్క్ ఎక్కువ ఉంది. కృష్ణా జిల్లాలో […]
నెల్లిమర్ల టీడీపీలో కొత్త ట్విస్ట్..క్యాండిడేట్ ఫిక్స్..!
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లిమర్లలో టీడీపీ ఇంచార్జ్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎన్నికలు ముగిసి మూడున్నర ఏళ్ళు అయినా ఇంతవరకు అక్కడ ఇంచార్జ్‌ని పెట్టలేదు. దీంతో టీడీపీ క్యాడర్ డల్‌గా కనిపిస్తోంది. పైగా అక్కడ కొందరు నాయకులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పతివాడ నారాయస్వామికి వయసు మీద పడటంతోనే ఇక్కడ కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట మొదలైంది. […]
గంటాతో వైసీపీలో ట్విస్ట్..రివర్స్ జంపింగ్?
దశాబ్దాల పాటు విశాఖ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ..అధికారం కోసం పార్టీలు, నియోజకవర్గాలు మార్చే గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయన టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్..మళ్ళీ టీడీపీలోకి వచ్చి..2014లో భీమిలి నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో టీడీపీకి దూరం జరిగారు. వైసీపీలోకి వెళ్లడానికి చూశారు గాని..విశాఖలో కొందరు వైసీపీ నేతలు […]
నాదెండ్లతోనే ట్విస్ట్..పవన్ రూట్ మార్చేలా?
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్‌కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్‌తో జగన్‌ని ఓడించడం […]
‘మూడు’పై వైసీపీ డైరక్ట్ ఎంట్రీ..సజ్జల కాన్సెప్ట్..!
అమరావతి విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైసీపీ సర్కార్‌కు అనుకున్న మేర ఊరట రాలేదు. అమరావతి ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించలేదు. కానీ 6 నెలల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలి..మూడు నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, నెలలో రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంశాలపై మాత్రమే స్టే విధించింది. అలా అని రాజధానిలో అభివృద్ధి చేయవద్దని చెప్పలేదు. ఇలా అమరావతి అంశంపై వైసీపీ అనుకున్నట్లుగా […]
అనంతలో జేసీ ‘టీడీపీ’..బాబుకు కన్ఫ్యూజన్.!
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురంలో..ఆ పార్టీ పరిస్తితి చాలా వింతగా ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీని వైసీపీ చిత్తు చేసింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ప్లస్ అవుతుంది. కాకపోతే వైసీపీపై వ్యతిరేకతని పూర్తి స్థాయిలో టీడీపీ వాడుకోలేకపోతుంది. పైగా టీడీపీలో కొన్ని గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో జేసీ ఫ్యామిలీ సెపరేట్ గా రాజకీయం నడుస్తోంది. అనంతలో టీడీపీ నేతలు ఒకదారిలో ఉంటే…జేసీ ఫ్యామిలీ […]
జగ్గయ్యపేటలో టీడీపీని కమ్మ తమ్ముళ్లే ఓడిస్తారా?
తెలుగుదేశం పార్టీకి ఉండే కంచుకోటల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ మెజారిటీ సార్లు టీడీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే తక్కువ మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే తాతయ్య ఎక్కడా తగ్గకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడుగా, వివాదరహితుడుగా ఉండటం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తాతయ్యపై అన్నీ […]