ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సీటు గురించి టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా సీటు ఇస్తానని చెప్పారు. ఇక దాని బట్టి చూస్తే అంత గొప్ప పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలు కృష్ణాలో కనిపించడం లేదు. కాకపోతే సీటు విషయంలో సీనియర్లకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది గాని..జూనియర్లకు ఆ అడ్వాంటేజ్ కనిపించడం లేదు. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి సీటు దక్కే విషయంలో రిస్క్ ఎక్కువ ఉంది.
కృష్ణా జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైమ్ గెలిచారు. అవనిగడ్డలో సింహాద్రి రమేశ్ బాబు, పామర్రులో కైలా అనిల్ కుమార్, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు, నందిగామలో మొండితోక జగన్ మోహన్ రావు గెలిచారు. జగన్ వేవ్‌లోనే వీరు గెలిచారు. అయితే ఈ మూడున్నర ఏళ్లలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేల పనితీరు పరిశీలిస్తే మరీ గొప్పగా ఏమి లేదు. ప్రభుత్వం నుంచే వచ్చే సంక్షేమ పథకాలు మినహా, ఆ ఐదుగురు నియోజకవర్గాల్లో తమదైన ముద్ర వేయలేదు.
అభివృద్ధి కార్యక్రమాలు తక్కువ..ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. పైగా అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఇండులో దూలం, వసంతలకు సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ దూలం, వసంతలకు సీటు విషయం డౌటే. ఇక అవనిగడ్డలో సింహాద్రికి పెద్ద పాజిటివ్ లేదు.
ఇక్కడ అంబటి రాంబాబుని బరిలో దింపుతారని ప్రచారం ఉంది. అదే జరిగితే సింహాద్రి సీటు ఔట్. ఇక కొద్దో గొప్పో పామర్రులో అనిల్, నందిగామలో జగన్‌కు కాస్త బలం కనిపిస్తోంది. వారిపై కాస్త వ్యతిరేకత ఉన్నా సరే..సంస్థాగతమైన బలం వల్ల ఇబ్బంది లేదని చెప్పవచ్చు. వీరిద్దరికి సీటు దొరికేలా ఉంది. మరి చూడాలి ఈ సారి కృష్ణాలో ఎంతమంది సీట్లు కోల్పోతారో.