నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ లో ఉన్న స్టార్ హిరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది.
ఆ సినిమా డిజాస్టర్ అయ్యి అను ఆశలు అడియాసలు చేసేసింది. ప్రస్తుతం అను వరుస ప్లాఫ్ సినిమాలతో సతమతమవుతున్న ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో అల్లు శిరీష్ కు జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఈ సినిమాలో తన గ్లామర్ డోస్ ని మరింత చూపించిన లిప్ లాక్ సన్నివేశాలతో రచ్చ చేసిన సినిమా విజయం సాధించలేకపోయింది.
అల్లు ఫ్యామిలీ ఈ సినిమా హిట్ అని చెప్పినప్పటికీ, ఫైనల్ రిజల్ట్ మాత్రం అను కు నిరాశ మిగిల్చింది. ఈ ముద్దుగుమ్మ అనుకున్న లెక్క తప్పింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నదొకటి సినిమా విడుదలయ్యాక జరిగింది ఒకటి ఈ సినిమా కూడా అను ఇమ్మాన్యుయేల్ కి సక్సెస్ ఇవ్వలేకపోయింది.