తెలుగుదేశం పార్టీకి ఉండే కంచుకోటల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ మెజారిటీ సార్లు టీడీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్ ఉన్నా సరే తక్కువ మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసి శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే తాతయ్య ఎక్కడా తగ్గకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. సౌమ్యుడుగా, వివాదరహితుడుగా ఉండటం, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని తాతయ్యపై అన్నీ వర్గాల ప్రజల్లో సానుభూతి ఉంది.
అలాగే జగ్గయ్యపేట మున్సిపాలిటీలో దాదాపు వైసీపీని ఓడించినంత పంచేశారు. టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక వైసీపీపై వ్యతిరేకత, గ్రూపు తగాదాలు వల్ల జగ్గయ్యపేటలో టీడీపీకి లీడ్ కనిపించింది. ఈ మధ్య చంద్రబాబు..జగ్గయ్యపేటలో రోడ్ షోలు నిర్వహించారు. జనం కూడా భారీగా వచ్చారు. ఇక అంతా బాగానే ఉంది..నెక్స్ట్ జగ్గయ్యపేటలో టీడీపీ గెలిచేస్తుందనే తరుణంలో..ఆ పార్టీలో గ్రూపు తగాదాలు కొంపముంచేలా ఉన్నాయి.
ప్రదానంగా కమ్మ వర్గమే టీడీపీకి శత్రువుగా తయారైంది. ఎందుకంటే ఆర్యవైశ్య వర్గానికి చెందిన తాతయ్యకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అలాగే జగ్గయ్యపేట టౌన్లో ఆర్యవైశ్య ఓటింగ్ ఎక్కువ..రూరల్లో కాపు, కమ్మ ఓటింగ్ ఉంటుంది. అయితే కమ్మ ఓటింగ్ ఉన్న ప్రాంతాల్లో తాతయ్యకు వ్యతిరేకంగా రాజకీయం నడుస్తోంది. తాతయ్య గెలితే తమ పెత్తనం పోతుందని కమ్మ వర్గం భావిస్తుంది.
అదే సమయంలో ఆర్ధిక వనరులు పుష్కలంగా ఉన్న కమ్మ నేత బొల్లా రామకృష్ణ..నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇప్పటికే తాతయ్యకు చంద్రబాబు సీటు ఖరారు చేశారు. అయినా సరే సీటు తనదే అని బొల్లా ప్రచారం చేస్తున్నారు..సెపరేట్ కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వల్ల టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇది టీడీపీకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది..అంతా బాగుందనుకునే సమయంలో కమ్మ నేతలే టీడీపీని ఓడించేలా ఉన్నారు.