టాలీవుడ్ లో హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి అందం, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈమె నట వారసురాలుగా పేరు పొందిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కేవలం బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇచ్చి అక్కడ సినిమాలలో నటిస్తు బిజీగా ఉంటోంది. కేవలం కథ పరంగా తన పాత్రకు పరంగా ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ వస్తోంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకోవడం కోసం పలుకథలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది జాన్వికపూర్.
తెలుగులో పలు చిత్రాలలో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా తన దృష్టి పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ అప్పుడప్పుడు పాపులార్ అవుతూ ఉంటుంది.తెలుగులో నటించే అవకాశం వచ్చిన వదులుకోనని తెలియజేస్తోంది. ఇక జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ఇంకా వెండితెర పైన ఎంట్రీ ఇవ్వలేదు.గట్టిగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా సమయం ఉంది అంటూ తెలియజేస్తూ ఉంటుంది.
ఇక స్టైలింగ్ లో కూడా తనకి అభిరుచి ఎక్కువగానే ఉన్నదట. జాన్వి కపూర్ కు. ఇక తన చెల్లెలికి కూడా తనలాగే అన్నిటిని నేర్పించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది జాన్వి కపూర్. కొత్త దుస్తులు ధరించినప్పుడు దూరంగా ఉన్న తన చెల్లికి సెల్ఫీ పంపించి మరి ఎలా ఉన్నానని అడిగి తెలుసుకుంటుందట. అలాగే శ్రీదేవి కూడా డ్రెస్లో అవడంపై చాలా శ్రద్ధ చూపించే వారినీ అప్పట్లో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రావడానికి చాలా గంటల సమయం తీసుకునేది శ్రీదేవి ముఖ్యంగా సెట్స్ కి వెళ్లే ముందు శ్రీదేవి అలంకరణకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉండేది ఇక తన అమ్మని చూసి జాన్వి కపూర్.. తన చెల్లెలకు కూడా అలాగే శ్రీదేవి కూతుర్లు కూడా అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.