టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా.. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌కు ఈ సినిమా చేరువైంది. ఈ సినిమాలో.. తేజ పర్ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే తో పాటు కథ కూడా చాలా హైలెట్ గా ఉందంటూ ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూ లో షేర్ చేసుకుంటున్నారు. ఇక ముందు ముందు టాలీవుడ్‌కు మంచి రోజులు వస్తాయని.. ఇలాంటి టాలెంటెడ్ దర్శకులు, నటీనటులతో సినిమాలు తీస్తే కచ్చితంగా టాలీవుడ్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందంటూ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. వేరే సినిమాతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కేవలం టాలీవుడ్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినిమా సత్తా చాటుకుంటుంది. ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఓ నెగెటివ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మిరాయ్ మూవీ.. కృష్ణ నటించిన మహాబలుడు సినిమాకు కాఫీ అని.. మక్కికి మక్కి సినిమా కథనంతా దించేశారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఓ వ్యక్తి తెలియజేస్తూ.. సినిమా లింక్‌ను సైతం దానికి అటాచ్ చేసి షేర్ చేసుకున్నాడు. ఈ ట్విట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో.. దీనిపై అందరూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే చాలామంది నెటిజన్స్ దీని సమర్థిస్తూ.. మిరాయ్ అంటూ గొప్పల డప్పులు కొడుతున్నారు.
కానీ.. ఇదంతా కృష్ణ నటించిన.. మహాబలుడు సినిమా క్రెడిట్ అని.. ఆయన సినిమానే కాపీ చేసి పెద్ద గొప్ప సినిమా తీసినట్లు ఫీలవుతున్నారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఒకవేళ కథ కాపీ అనేది వాస్తవమైన.. అదే కథను ఎలాంటి విజువల్స్, స్క్రీన్ ప్లే లేకుండా మంచి క్వాలిటీతో తెరకెక్కించకపోతే ఈ రేంజ్ సక్సెస్ రాదని కార్తీక్ ఘట్టయనేని టాలెంట్.. అలాగే తేజ సజ్జ, మంచు మనోజ్‌ల పర్ఫామెన్స్ కూడా సినిమాకు ఖచ్చితంగా కలిసివచ్చిందని.. కేవలం కథ మాత్రమే సినిమా సక్సెస్ కు కారణం కాదంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న సినిమాలైనా సరే మంచి కంటెంట్ ఉంటే.. కచ్చితంగా సపోర్ట్ చేస్తారని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మిరాయ్ సినిమాకు సైతం సపోర్ట్ అందించాడు. ఒకవేళ తండ్రి సినిమాను కాపీ చేసి తెరకెక్కించి ఉంటే ఈ సినిమాకు మహేష్ ప్రశంసలు దక్కేవి కాదు కదా.. పూర్తిగా ఇది కాపీ కంటెంట్ కాదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కాపీ వార్తలపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
మిరాయ్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కానీ సినిమా మొత్తం చూస్తే 18/04/1969 హీరో కృష్ణ నటించిన మహాబలుడు సినిమాని మక్కీకి మక్కీ దించినట్టు కనబడడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. సినిమా లింక్ https://t.co/IoMlGzL3ob
— Ravi Vallabhaneni (మహానాడు 2025) (@ravivallabha) September 14, 2025