1500 కు పైగా సినిమాలు.. కోట్ల ఆస్తులు దానం చేసిన నటి.. చివరకు ఒంటరిగా..

వరల్డ్ వైడ్‌గా భారీ పాపులారిటి దక్కించుకున్న న‌టుల‌లో ఈబె కూడా ఒక‌టి. ఈ నటికి తెలుగు రాష్ట్రాలలోనూ పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరూ టాప్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు.. కెరీర్ మొత్తంలో 1500కు పైగా సినిమాల్లో నటించగా.. 6000కు పైగా నాటకాల్లో ఆకట్టుకుంది. చిన్న వయసులోనే అమ్మమ్మ పాత్రలతో తనదైన ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల ఆఫర్లను అందుకుంటూ కోట్లు గడించింది. ఇక ఎన్నో మంచి పనులతో ఆమె పుట్టిన ఊరికి కుటుంబ దేవతగా మారింది. ఇప్పటికీ ఆమెను అక్కడ పూజిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే దివంగత ప్రముఖ నటి ఎస్. ఎన్. లక్ష్మి. 1927లో విరుద్ధ నగర్ జిల్లాలో అరుపుకొట్టై సమీపంలో ఓ కుగ్రామంలో జన్మించిన ఈమె.. తల్లిదండ్రులకు ఆఖరి సంతానం.

Jeevan's World: RIP S.N. Lakshmi

13 మంది పిల్లల్లో చిన్నది. ఇక తండ్రి రాజా కంబాల నాయక్ ప్యాలెస్ పరిపాలన విభాగంలో పనిచేసేవారు. అయితే.. లక్ష్మి పుట్టిన తర్వాత కొన్ని కారణాలతో ఆయన తైవర్‌ ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో.. ఆర్థికంగా కుటుంబం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు.. కొంతకాలానికి తండ్రి మరణించాడు. అలా.. ఆరు సంవత్సరాల వయసులో ఓ నాటక బృందంలో లక్ష్మీ చేరింది. ఆమె ఇల్లు వదిలి నాటక బృందంతో బయటకు వచ్చేసింది. 1948లో రిలీజ్ అయిన చంద్రలేఖ సినిమాలో ఆమె డ్యాన్స్ టీమ్‌లో ఒక రోల్ పోషించింది. ఆమె డైరెక్టర్ సావిత్రి, నల్లతంగై, తమరై కులం, అవానా సినిమాల్లో మెప్పించింది. ఇక తన కెరీర్‌లో పెళ్లి అన్న చాప్టర్ లేకుండా సినిమాలకే లైఫ్‌ను అంకితం ఇచ్చింది.

ఎంజీఆర్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, ఎస్ఎస్ రాజేంద్రన్, ముత్తు రామ లాంటి స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. ఇక 2012లో 85 సంవత్సరాలు వయసులో త‌న తుదిశ్వాస విడిచింది. అంత్యక్రియలు తన స్వగ్రామం చందనల్‌ గుడిలో జరిగాయి. అక్కడ స్మారక చిహ్నాన్ని కూడా ప్రజలు నిర్మించారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు తన కుటుంబం ఆమెను అక్కడ దేవతలా పూజిస్తూ వస్తున్నారు. వందలాది సినిమాలో నటించిన లక్ష్మీ.. తన ఫ్యామిలీకి ఎంతో అండగా నిలబడింది. చివరి వరకు వివాహం చేసుకోకుండా ఒంటరి లైఫ్ లీడ్ చేసింది. తను సంపాదించిన ఆస్తులు.. తన కుటుంబాలకే విరాళంగా పంచింది. తన స్వగ్రామంలో 10 ఎకరాలకు పైగా తోటలు .. ఇళ్ళను.. తను పెంచిన వాళ్లకు విరాళంగా ఇచ్చిందని గ్రామస్తులు వెల్లడించారు. అలాగే 20 కి పైగా నిరుపేదల ఇళ్ల‌ కోసం సహాయం అందించిందట.