టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారంతా ప్రస్తుతం సినిమాల విషయంలో ఫ్యాన్స్ ను విపరీతంగా డిసప్పాయింట్ చేస్తున్నారు. దానికి కారణం కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఏళ్ల తరబడి సినిమాలు చేసుకుంటూ పోవడమే. ఒక్క రెబల్ స్టార్ ప్రభాస్ తప్పించి.. ఇతర స్టార్ హీరోలు ఎవరు తమ సినిమాలను ఏడాదికి కనీసం ఒక్కటి కూడా రిలీజ్ చేయడం లేదు. కొత్త సినిమాల సంగతి అట్టుంచితే.. కనీసం సెట్స్ పై ఉన్న సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా అందించడం లేదు. కనీసం ఒక పోస్టర్, టీజర్ ఏది ఇవ్వకుండా చాలా గోప్యంగా మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యాన్స్.. ఆయన సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ అయినా వస్తుందని ఎంతగానో ఆశపడ్డారు.
కానీ.. రాజమౌళి ఆ అసలపై నీరు జల్లేశాడు. ఈ క్రమంలోనే రీ రిటీజ్ సినిమాలతో ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. కేవలం మహేష్ బాబు విషయంలోనే కాదు.. ఇతర హీరోల సినిమాల విషయంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో నెలకొంటున్నాయి. సినీ స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ చిన్న పోస్టర్ లేదా క్యాప్షన్ తో.. బర్త్డే ట్రీట్ సరిపెటేస్తున్నారు మేకర్స్. అప్డేట్ల సంగతి పక్కన పెట్టేసి.. పాత బ్లాక్ బస్టర్ సినిమాల వైభవాన్ని చూసుకుని మురుసుకోవడమే అభిమానుల వంతు అయింది. సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. ఫ్యాన్స్ లోను ఈ రీ రిలీజ్‌ల విషయంలో మిశ్రమ స్పందన వస్తుంది.
రీ రిలిజ్ సినిమాల అనుభూతి కేవలం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కానీ.. వాళ్లకు కావాల్సిన కిక్ అయితే ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. మళ్లీ ఈ రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల విషయంలోనూ ఫాన్స్ వార్ జరుగుతున్నాయి. ఇక ఇలాంటి వరవడికి బ్రేక్లు వేయడం కేవలం ఆ స్టార్ హీరోల వల్లనే అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈ స్టార్ హీరోస్ అంతా ఏడాదికి కనీసం ఒక్క సినిమానైనా సెట్స్ పైకి తీసుకువచ్చి.. ఆ సినిమాతో ఆడియన్స్ను పలకరించడం.. సినిమాకు సంబంధించిన అప్డేట్స్.. మేకర్స్ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌కు అందిస్తే తప్ప.. రీ రిలీజ్ సినిమాల డబ్బులు పట్టుకొని రికార్డుల గురించి మాట్లాడుకునే వరవడి మారదు. ప్రతి ఒక్క అభిమాని తమ హీరోను ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో.. కొత్త లుక్ లో చూసుకోవాలని ఆరటపడుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోలు సినిమాల విషయంలోను పాత చింతకాయ పచ్చడిలా రీ రిలీజ్ సినిమాలతో సరిపెట్టకుండా సినిమాలు చేస్తే మంచిది.