తెలుగు తెరపై మహిళా ప్రాధాన్య కథానాయికల సినిమాలు చేయడం చాలా రేర్. ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి లాంటి లెజెండరీ హీరోయిన్లకు మాత్రమే ఆ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అనుష్క, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లకు మాత్రమే అటువంటి కథలతో ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. కానీ మిగతా హీరోయిన్లకి మాత్రం అలాంటి ప్రయోగాలు పెద్దగా వర్కౌట్ కావు. ఇదే విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ ఒక వేదికపై చాలా ఓపెన్ గా చెప్పిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తాజాగా అనుపమ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా “పరదా” ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. పూర్తి అయ్యి ఏడాది అయినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేక పోయారు. ఎట్టకేలకు సురేష్ బాబు ముందుకు రావడం, మంచి థియేటర్లు దొరకడం వంటివి సినిమాకు బూస్ట్ గా మారాయి. ప్రెస్ మీట్ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ, “పోస్టర్ పై అమ్మాయి ఒకళ్లే ఉంటే అందరూ దూరం పరుగు తీస్తారు. నిర్మాతలు, ఓటిటి వారు కూడా ఇదే దృక్పథంతో చూస్తారు. జనాలకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి లేకపోవడమే నిజం. థియేటర్లలో అయినా, ఓటిటిలో అయినా అలాంటి సినిమాలు పట్టించుకోరు” అంటూ ఆమె నిజాన్ని మీడియా ముందు నిర్మొహమాటంగా వెల్లడించారు.అయితే, “పరదా” సినిమా గురించి మాట్లాడుతూ – “ఇది చిన్న సినిమా కావొచ్చు. కానీ చెప్పే సందేశం మాత్రం చాలా పెద్దది. తప్పకుండా థియేటర్‌కి వచ్చి చూడండి. మేము ఎంతో హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా ఇది” అని ప్రేక్షకులను అభ్యర్థించారు. ఈ సినిమాతో అనుపమకు ఫస్ట్ సోలో లీడ్ రిలీజ్ కూడా కావడంతో, ఇది హిట్ అయితే ఈ లైన్‌లో ఆమెకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నిజాయితీతో కూడిన మాటలతో ఆమెపై ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల పట్ల ఉన్న వ్యూహాలను మరోసారి ఆలోచించేలా చేస్తోంది. ఆగస్టు 22న రాబోతున్న “పరదా” విజయవంతమైతే, ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమాల పట్ల ఉన్న ఒత్తిడిని కొంతవరకు తగ్గించగలదు.