ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహల్గాం లోయల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ భయంకర దాడి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేసి.. తొమ్మిది ఉగ్రస్థావరాలను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 100 మంది ఉగ్రవాదులు ఈ ఎటాక్‌లో మరణించారు. ఆ తర్వాత భారత్ పై పాక్ ఎదురుదాడికి దిగింది. భారత్ ఈ దాడిని సైతం సమయస్ఫూర్తితో తిప్పి కొట్టి పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది.
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు కొద్దిరోజుల పోటాపోటీ వార్ తర్వాత కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక ఉగ్రవాదులు.. భారత మహిళల పవిత్ర బొట్టు చెరిపి వేయడంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఈ మిషన్ ను పూర్తి చేశారు. ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టారు. విచిత్రంగా ఈ ఆపరేషన్ నిర్వహించే బాధ్యత మహిళా అధికారులకు అప్పగించింది ఇండియన్ గవర్నమెంట్. ఈ బాధ్యతలను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్.. వ్యోమిక సింగ్ ఇద్దరు దగ్గర ఉండి చూసుకున్నారు. ఇక ఆపరేషన్‌ను ముందుండి నడిపిన వీళ్ళిద్దరికీ సపోర్ట్ గా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మీస్రీ వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు వార్ ముగిసిన తర్వాత.. దానికి సంబంధించిన అన్ని వివరాలను మీడియాతో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక వీళ్థపై భారత ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా ఓ బీజేపీ మంత్రి కల్నల్ సోషియా గురించి మొత్తం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిజెపి మంత్రి విజయ్ షా ఈ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాని తుడిచేసి.. పారిపోయారు. వాళ్లపై ఆపరేషన్ సింధూర్ చేపట్టి మనం వాళ్లకు గట్టి బుద్ధి చెప్పాం అంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కల్నల్ ఖురేషి మతం గురించి ప్రస్తావించిన ఆయన.. వాళ్ల మతానికి చెందిన సోదరి కల్నల్ ఖురేషితోనే వాళ్లకు బుద్ధి చెప్పించామని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ కాస్త.. నెటింట వివాదాస్పదంగా మారాయి. మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ప్రసంగంలో మతం గురించి మాట్లాడటం.. టెర్రరిస్టుల సోదరి అని సంబోధించినట్లు ఉందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరమైనవేనని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మంత్రి విజయ్‌షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.