దయచేసి ఆ ఫోటోలను షేర్ చేయవ‌ద్దు.. బిగ్ స‌ర్‌ఫ్రైజ్ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విస్ట్‌..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట చిన్న.. చిన్న.. క్యారెక్టర్ లో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దేవరకొండ.. తర్వాత‌ సినిమాల్లో హీరోగా అవకాశాన్ని దక్కించుకుని స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు ఊహించిన రేంజ్‌లో ఒక సక్సెస్ కూడా అందలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం విజయ్‌కు బ్యాడ్ టైం నడుస్తుంది.

తీసిన సినిమా హిట్ కాకపోతే సరేసరి. కనీసం పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి వెనక్కి రావడం లేదు. ఈ క్రమంలో మంచి కథ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకొని ఆచితూచి అడుగులు వేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ యంగ్‌ హీరో. గౌతం తిననూరి డైరెక్షన్లో వీడి 12 వర్కింగ్ టైటిల్ తో దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ్రీ లంకలో జరుగుతోంది. కాగా అక్కడ షూట్‌కు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెటింట‌ వైరల్‌గా మారాయి. వీటిపై స్పందించిన మేకర్స్.. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు.

డియర్ రౌడీ ఫాన్స్ మీ ముందుకు మంచి కథని తీసుకొస్తాం. దీనికోసం వీడి 12 టీమ్ అంతా చాలా కష్టపడుతున్నాం. ఇప్పటికే 60 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ ఆ పోస్టులో వెల్లడించారు. అయితే ప్రస్తుతం లీక్ అవుతున్న ఫోటోలను దయచేసి ఇక షేర్ చేయవద్దని.. మీకు త్వరలోనే సర్ప్రైజ్ ఇవ్వనున్నామంటూ విజయ్ దేవరకొండ కూడా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు రిక్వెస్ట్ చేశాడు.