రానా ” రాక్షస రాజా ” మూవీపై దిమ్మతిరిగే అప్డేట్… ఇదీ కధ కిక్ అంటే…!

కొంతకాలం కితం దగ్గుబాటి రానా హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నేనే రాజు నేనే మంత్రి ” ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక మళ్లీ తాజాగా వీరిద్దరి కాంబోలో రానున్న మూవీ ” రాక్షస రాజా “‌.

ఇక ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చేసింది. మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టార్ డ్రామా గా రూపొందునున్న ఈ మూవీలో రానా పవర్ఫుల్ పాత్ర పోషించనున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ యొక్క కథ 1930లో బ్రిటిష్ వారి కాలం కథగా రూపొందనుందని తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే రానా డిఫరెంట్ మేకవర్ తో సిద్ధమైనట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ అప్డేట్ రానా అభిమానులకి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. ఇక ఈ సినిమా పై రానా అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాతో మరోసారి రానా తన ఖాతాలో హిట్ వేసుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.