అక్కడ దర్శనమిచ్చిన దగ్గుబాటి కొత్త జంట… హీరో, హీరోయిన్ల‌లా ఉన్నారే..!

టాలీవుడ్ దగ్గర నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, అలాగే దగ్గుబాటి రానా తమ్ముడు అయినా అభిరామ్ కి తాజాగా వివాహమైన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుక శ్రీలంకలో జరగడం విశేషం. ప్రత్యూష అనే అమ్మాయిని అభిరాం వివాహం చేసుకున్నాడు. ఇక వీరి పెళ్లి శ్రీలంకలో మూడు రోజుల పాటు అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు.

ఇక వీరి పెళ్లికి ప్రముఖ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులో రానా, అభిరామ్, సురేష్ బాబు, నాగచైతన్య తదితరులు వీరి పెళ్లికి ముందు కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే శుక్రవారం దగ్గుబాటి కుటుంబ సభ్యులు శ్రీలంక నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు.

ఈ నేపథ్యంలోనే కెమెరాలకు చిక్కారు ఈ జంట. వధూవరులు ఇద్దరు నడిసి వస్తున్న ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ప్రేక్షకులు. ఈ ఫోటోలను చూసిన దగ్గుబాటి ఫ్యాన్స్…” జంట చూడముచ్చటిగా ఉంది.. వీళ్ళిద్దరిని చూస్తుంటే హీరో, హీరోయిన్ల ఉన్నారు “… అంటూ కామెంట్లు చేస్తున్నారు.