బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పేసింది.” ఏక్ నిరంజన్ ” లో ఇద్దరం కలిసి చేసినప్పుడు చాలా యంగ్ అని.. ఆ టైంలో ప్రభాస్ ఫామ్ హౌజ్ కు తీసుకెళ్లి ఫుడ్ పెట్టిన విధానం, తనను చూసుకున్న తీరు ఇష్టంగా గుర్తుంచుకున్నానని తెలిపింది. తాము ఇద్దరం కలిసి పదేళ్లు అయిపోయిందని.. ఇప్పుడు మళ్లీ కలిస్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుందని తెలిపింది.
ఇక మూవీ షూటింగ్లో ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్ళమని, అతను యాక్టర్ గా, పర్సన్‌గా ఎదగడం చూస్తుంటే హ్యాపీగా ఉందన్న ఈ బ్యూటీ…” ఏక్ నిరంజన్ 2 ” లో ఛాన్స్ వస్తే కచ్చితంగా ప్రభాస్‌తో నటిస్తానని తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
మరి కంగనాకి ఏక్ నిరంజన్ 2 సినిమాలో ఛాన్స్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మా డార్లింగ్ అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాడని.. అమ్మాయిలను ఎంతగానో గౌరవిస్తాడని.. అందుకే ప్రభాస్‌తో నటించిన ఎవరైనా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.